Saturday, May 11, 2024
- Advertisement -

ఏమంత్రం వేశావే రివ్యూ

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ సూపర్ స్టార్ స్టేటస్‌కి వెళ్ళిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ స్థాయిలో విజయ్‌కి తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ వచ్చింది. అలాంటి బ్లాక్ బస్టర్ అండ్ మెమొరబుల్ సిినిమా తర్వాత ఈ రోజు విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన ‘ఏ మంత్రం వేశావే’ సినిమా రిలీజ్ అయింది. మరి అర్జున్‌రెడ్డి హవాను ఈ ఏ మంత్రం వేశావే కంటిన్యూ చేసిందా? సిినిమా ఎలా ఉంది?

అర్జున్ రెడ్డి సినిమాను మూడు గంటలపాటు చూశారు ప్రేక్షకులు. కానీ ఏ మంత్రం వేశావే సినిమాను మాత్రం కనీసం పదినిమిషాలు కూడా చూడలేని పరిస్థితి. సోషల్ మీడియాకు అడిక్ట్ కావొద్దు అన్న సందేశం వినిపించడానికి వచ్చిన ఈ సినిమా మరీ పాత చింతకాయపచ్చడిలా ఉంది. అంత ట్రెండీ మెస్సేజ్ ఇవ్వాలనుకున్న దర్శకుడు ఒక్క సన్నివేశాన్ని కూడా ఆ స్థాయిలో రాసుకోలేకపోయాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో అద్భుతమైన నటన చూపించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మరీ అమెచ్యూరిష్‌గా కనిపిస్తాడు. అర్జున్‌రెడ్డి సినిమాకంటే ముందు విజయ్ ఒప్పుకున్న సినిమాల్లో ఇదొకటి. అప్పట్లో హీరోగా ఓ మంచి అవకాశం కోసం చూస్తూ ఉన్న విజయ్ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఆఫర్‌నీ ఒప్పుకున్నాడు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. అందుకే సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు విజయ్. ఆ రకంగా ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ముందుగానే చెప్పేశాడు. అందుకే ప్రేక్షకులు కూడా థియేటర్స్‌లో చాలా తక్కువ సంఖ్యలో కనిపించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి టెక్నికల్ వర్క్స్ అన్నీ కూడా డైరెక్షన్ కంటే బ్యాడ్‌గా ఉన్నాయి. సినిమాలో కనీసం ఒక్క సీన్ గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

కానీ క్లైమాక్స్‌లో …….ఒక్కసారి మీ సెల్‌ఫోన్స్ ఆఫ్ చేయండి…..సిస్టమ్స్ షట్ డౌన్ చెయ్యండి…….మీ ఆత్మీయులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళలోకి చూస్తూ ఆత్మీయంగా మాట్లాడండి అన్న మెస్సేజ్ మాత్రం ఈ రోజు ఉన్న సమాజానికి కచ్చితంగా చాలా చాలా అవసరమైనదే. అలాంటి మంచి మెస్సేజ్ ఇవ్వాలనుకోవడం గొప్ప విషయం. కానీ ఆ స్థాయి ట్రెండీ మెస్సేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు కథ, కథనాలు కూడా అదే స్థాయిలో లేకపోతే సినిమా పాత చింతకాయపచ్చడి అవదా? ప్రేక్షకులు విసిరి కొట్టేయరా? ఈ ఏ మంత్రం వేశావేకు కూడా అదే జరిగింది. ఈ సినిమాతో విజయ్‌కి వచ్చే నష్టం అయితే ఏమీ ఉండకపోవచ్చు కానీ నిర్మాతలు…..సినిమాను కొన్నవాళ్ళకు(ఎవరైనా ఉంటే) మాత్రం భారీ నష్టాలు ఖాయంగానే కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -