Monday, April 29, 2024
- Advertisement -

రాజీనామాల వెనుక ఇంత క‌థ ఉందా…?

- Advertisement -

మొత్తం 25 మంది ఎంపిలతోనూ రాజీనామాలు చేయిద్దాం’ అంటూ జగన్ పదే పదే చెప్పటంపై రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. ఇరు పార్టీల ఎంపీలు రాజీనామాలు చేసినంత మాత్రానా ఎన్‌డీఏకు వ‌చ్చిన ఇబ్బందేమి ఉండ‌దు. కాని జగన్ ఎంపిల రాజీనామాలపై అంతగా పట్టుబడుతున్నార‌న్న‌దే ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాజీనామాలు చేసినా కావాల్సినంత బ‌లంఉంది. అయితే మొత్తం 25 మంది ఎంపిలు గనుక రాజీనామాలు చేస్తే కేంద్రంలో తప్పక కదలిక వస్తుంది. రాజీనామాలను గనుక టిడిపి, వైసిపిలు ఆమోదింపచేసుకుంటే కచ్చితంగా ఉపఎన్నికలు నిర్వహించాల్సిందే. బిజెపికి చెందిన ఇద్దరు ఎంపిలు రాజీనామాలు చేయకపోయినా పర్వాలేదు. మిగిలిన 23 స్ధానాల్లో ఉపఎన్నికలు తప్పవు. ఉపఎన్నికల్లో ఎటూ టిడిపి, వైసిపిలు పోటీ పడతాయి. అప్పుడు బిజెపి ఏం చేస్తుంద‌నేదే ఇక్క‌డ ర‌హ‌స్యం.

2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఉబలాటపడుతున్న బిజెపికి తన బలమెంతో తెలుసుకోవాలంటే ఇదే చక్కటి అవకాశం. కాబట్టి బిజెపి కూడా పోటీ చేస్తుంది. టిడిపి, వైసిపిల్లో ఏ పార్టీకెన్ని సీట్లు వచ్చిన ఒకటే. బిజెపికి మాత్రం ఏ సీటులోనూ గెలవలేదనుకోండి అప్పుడు ఏపిలో బిజెపి భవిష్యత్తేంటో జాతీయ నాయకత్వానికి తెలిసి వస్తుంది.

ప్రత్యకహోదా, ఏపి ప్రయోజనాలు, విభజన హామీల అమలు లాంటి ప్రాధాన్యతలు అప్పుడు మోడికి గుర్తుకువస్తాయి. లేకపోతే భవిష్యత్తులో బిజెపికి పుట్టగతులుండవనేది మోదీకి తెలుస్తుంది. అందుకే ఇటు మోడికి అటుక అమిత్ షాకు తెలియాలనే జగన్ పదే పదే ఎంపిల రాజీనామాలపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే జ‌గ‌న్ ప‌దే ప‌దే ఎంపీల రాజీనామాలాను కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -