Sunday, May 19, 2024
- Advertisement -

జక్కన్న మాస్టర్ బ్రెయిన్…. ఎన్టీఆర్, చరణ్‌ల జర్నీకి అసలు రీజన్ ఇదా?

- Advertisement -

సినిమాలు తీయడం కంటే కూడా…. ఆ సినిమాలను ప్రమోట్ చేసే విషయంలో మాత్రం రాజమౌళిని మించిన డైరెక్టర్ ఇండియాలోనే లేడు. రాజ్ కుమార్ హిర్వాణీ, శంకర్, కరణ్ జోహార్‌లాంటి డైరెక్టర్స్ ఎవరూ కూడా రాజమౌళికి సాటిరారు. అలాగే పబ్లిసిటీ కోసమే సినిమాలు తీస్తున్నాడా అన్న అనుమానం తెప్పించే రామ్ గోపాల్ వర్మ కూడా రాజమౌళి ముందు దిగదుడుపే. బాహుబలి సినిమాతో తన తెలివితేటలను ఆ స్థాయిలో నిరూపించుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్‌ల సినిమా విషయంలో కూడా అంతకుమించిన పబ్లిసిటీ ప్లాన్స్ షురూ చేశాడు రాజమౌళి. ఎన్టీఆర్, చరణ్‌ల లండన్ పయనం వెనుక రకరకాల కారణాలు బయటికి వచ్చాయి. అయితే అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకున్న ఇండస్ట్రీ కూడా షాక్ అవుతోంది.

నందమూరి-మెగా ఫ్యామిలీల మధ్య వైరం గురించి కొత్తగా చెప్పేది ఏముంది? నిజానికి ఈ రెండు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయి అనే విషయం పక్కనపెడితే నందమూరి-మెగా అభిమానుల మధ్య మాత్రం శతృత్వం స్థాయి గొడవలు ఉన్నాయి. ఎన్టీఆర్-చరణ్‌లతో సినిమా తీస్తానని ప్రకటించిన రాజమౌళిని ఈ గొడవలే భయపెడుతున్నాయి. అందుకే వీలైనంత వరకూ సినిమా ప్రారంభం కాకముందే నందమూరి-మెగాభిమానుల మధ్య సయోధ్య కుదిరేలా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అందుకే ఎన్టీఆర్-చరణ్‌లు చాలా ఎక్కువ సార్లు కలిసి కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్-చరణ్‌లు కలిసి లండన్ పయనం అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేశాడని తెలుస్తోంది. నిజానికి తర్వాత చేయబోయే సినిమాల కోసం మేకోవర్ అవ్వాలనుకున్నారు చరణ్, ఎన్టీఆర్. ఇద్దరూ వేర్వేరుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే జక్కన్న మాత్రం ఇద్దరూ కూడా లండన్‌లో మేకోవర్ అయ్యేలా ప్లాన్ చేశాడు. ఈ ఇద్దరు హీరోలు ఎంతగా కలిసి కనిపిస్తే అభిమానుల మధ్య అంత సయోధ్య పెరుగుతుందన్నది రాజమౌళి ప్లాన్.

అలాగే తన సినిమా ప్రారంభం అయ్యేనాటికే ఆ సినిమాకు క్రేజ్ తీసుకురావాలనుకుంటున్నాడు జక్కన్న. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 200 కోట్లు రీచ్ అవనుంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే సూపర్ బజ్ వస్తే బయ్యర్స్ నుంచి భారీగా అడ్వాన్స్‌లు వస్తాయి. ఆ రకంగా నిర్మాతలకు ఫైనాన్స్ తీసుకురావాల్సిన బాధలు తప్పుతాయి. వడ్డీలను ప్రొడక్షన్‌లో కలపాల్సిన అవసరం ఉండదు. తన సినిమాలన్నింటికీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టేజ్ ఎప్పుడో దాటేశాడు జక్కన్న. పర్సంటేజ్ పుచ్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ ఎంతగా సేవ్ చేస్తే అంత మిగులుతుంది రాజమౌళికి. ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో ఎలాగూ అస్సలు కాంప్రమైజ్ కాడు. అయితే ఇలాంటి పబ్లిసిటీ ట్రిక్స్ ప్లే చేసి నిర్మాతకు వడ్డీకి తీసుకురావాల్సిన అవసరం తప్పిస్తే వడ్డీ భారం కోట్ల రూపాయలు మిగుల్తుందనడంలో సందేహం లేదు. పనిలో పనిగా నందమూరి-మెగాభిమానుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఎన్టీఆర్-చరణ్‌లు కలిసి ఉన్న వీడియోను స్వయంగా రాజమౌళి టీమే మీడియాకు పంపించిందని తెలుస్తోంది. అంతకుమించి ట్రయల్ షూట్ లాంటివి ఏవీ లేవని రాజమౌళి యూనిట్ మెంబర్స్ చెప్తున్నారు. ఎన్టీఆర్, చరణ్‌లతో రాజమౌళి టీం మెంబర్స్ ఎవ్వరూ వెళ్ళడం లేదు. జక్కన్న టీం మొత్తం ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ. ఏది ఏమైనా తన పబ్లిసిటీ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌తో మరోసారి ఫిల్మ్ ఇండస్ట్రీ పబ్లిసిటీ మాస్టర్స్‌కి షాక్ ఇచ్చాడు జక్కన్న. పబ్లిసిటీ విషయంలో తనను కొట్టే డైరెక్టర్ ఇండియాలోనే లేడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -