Saturday, May 4, 2024
- Advertisement -

హీరో విజ‌య్‌కు పెళ్లాల పోరు..!

- Advertisement -

హీరో విజ‌య్ అన‌గానే త‌మిళ స్టార్ హీరో విజ‌య్ అనుకున్నారు క‌దా. కాదులేండీ ఈ విజ‌య్ వేరు. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ త‌రుచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తునే ఉంటాడు.గ‌తంలో విజ‌య్ జైలుకు కూడా వెళ్లాడు. జిమ్ ట్రైనర్ మారుతి గౌడపై దాడి చేసిన కారణంగా దునియా విజయ్‌ని జైలులో పెట్టారు. తాజాగా విజ‌య్‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. విజ‌య్ వ్య‌క్తిగ‌త జీవితానికి వస్తే అత‌నికి ఇద్ద‌రు భార్య‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే.విజ‌య్ జైలులో ఉన్న‌ప్పుడే వీరిద్ద‌రు గొడ‌వ‌లు ప‌డ‌టం మొద‌లుపెట్టారు.త‌న భ‌ర్త విజ‌య్ కీర్తిని పెళ్లి చేసుకోలేద‌ని ఆరోప‌ణ‌లు చేసింది మొద‌టి భార్య నాగరత్న.అయితే విజ‌య్ మాత్రం రెండో భార్యేకే మ‌ద్ద‌తు తెలుపుతున్నాడు.

కీర్తిని నేను పెళ్లి చేసుకున్నాను.. మేమిద్దరం ఒకే ఇంటిలో సంసారం చేస్తున్నాం. నాలుగేళ్ల క్రితం నా మొద‌టి భార్య నాగరత్న నా పరువు బజారుకి ఈడ్చిందంటూ చెప్పుకొచ్చాడు విజ‌య్‌.మొద‌టి భార్య నాగరత్న నా తల్లితండ్రులను కూడా సరిగ్గా చూసుకోలేదు,నా ఆస్థి కోసం ఆమె ఇదంతా చేస్తుంద‌ని తెలిపాడు విజ‌య్‌.ఇప్ప‌టికే నా సొంత ఇంటిని ఆమె పేరు మీద రాసిచ్చి,నేను అద్దె ఇంట్లో ఉంటున్నానంటూన్నాడు విజ‌య్‌. ఒక్కరోజు కూడా నిజం మాట్లాడేది కాదని ఆమెపై విమర్శలు చేశారు. సోమవారం రాత్రి బెయిల్ పై విడుదలైన దునియా విజయ్ అతడి రెండో భార్య కీర్తితో కలిసి దేవాలయానికి, దర్గాకి వెళ్లి పూజలు చేశారు. మ‌రి విజ‌య్ పెళ్లాల పోరు ఎంత దూరం వెళ్తూందో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -