Friday, May 3, 2024
- Advertisement -

సూర్య వైఫ్ సినిమా కి విజయ్ సినిమా కనెక్షన్

- Advertisement -

తమిళం లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టి అసలు ఎదురే లేదు అనే విధం గా దూసుకెళ్తున్న నటి జ్యోతిక. వరుసగా సినిమాలు చేస్తూ నే ఎక్కడా తగ్గకుండా జ్యోతిక ముందుకు వెళ్లడం సంతోషించే విషయం. ఈ విషయం లో సూర్య ప్రోత్సాహం కూడా ఎంతో కొంత ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆసక్తికరం అంశం ఏంటి అంటే ఈ హీరోయిన్ నటిస్తున్న కొత్త చిత్రానికి పొన్మగళ్ వందాల్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

ఫ్రెడ్రిక్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బానర్ మీద నిర్మిస్తున్నాడు. ఈ సినిమా లో జ్యోతిక తో పాటు భాగ్యరాజ్, పార్తీబన్, ప్రతాప్ పోతన్ కూడా నటిస్తున్నారు. గోవింద్ వసంత ఈ సినిమా కి సంగీత దర్శకుడు కాగా ఈ సినిమా టైటిల్ కి సంబందించిన ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తిరుగుతుంది.

అయితే ఈ సినిమా టైటిల్ హీరో విజయ్ గత చిత్రాల్లో ఒక చిత్రం అయిన ఆరగియా తమిళ్ మగన్ అనే సినిమా లో పాట టైటిల్ అని, విజయ్ సినిమా కనెక్షన్ ఈ జ్యోతిక సినిమా కి బాగా పనికొస్తుంది అని అందరూ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -