Thursday, May 16, 2024
- Advertisement -

విజయ్ ‘స‌ర్కార్’ టీజ‌ర్

- Advertisement -

త‌మిళ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ ,స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా స‌ర్కార్‌.వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.తాజాగా సర్కార్ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చిత్ర యూనిట్‌.టీజర్ అంచనాలకు తగ్గట్లుగానే ఉంది. విజయ్ తనదైన స్టయిల్ లో చెప్పే డైలాగులు టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. ‘ఐ యామ్ ఏ కార్పొరేట్ క్రిమినల్’ అంటూ యాటిట్యూడ్ తో విజయ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రాజకీయాలు, కార్పొరేట్ నేపధ్యంలో సాగే ఈ సినిమా దీపావళి సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, రాధారవి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులని అశోక్ వల్లభనేని దక్కించుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -