Tuesday, May 7, 2024
- Advertisement -

భార్యకు కూడా తెలియకుండా ఆ పని చేసిన విజయ్ సేతుపతి!

- Advertisement -

నటనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ, ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలిసిందే. సినిమాలలోకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించిన విజయ్ సేతుపతి ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలం తర్వాత అతనికి మంచి గుర్తింపు వచ్చింది.ఏ హీరోలైన ఇండస్ట్రీలో మంచి అవకాశాలు లభించి గుర్తింపు సంపాదించుకుంటే నెగిటివ్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు. కానీ విజయ్ సేతుపతి మాత్రం అందుకు భిన్నం.

తను కేవలం స్టార్ డమ్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా తన నటించే పాత్రకు ప్రాధాన్యత ఇస్తాడు. ఈ విధంగా ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి నటించడం వల్ల ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన మాస్టర్ సినిమా అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. హీరో విజయ్ తో పోటాపోటీగా పడి నటించిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి తన జీవితంలో చేసిన అతి పెద్ద సాహసం గురించి తాజాగా చెప్పుకొచ్చాడు.

తాను సినిమాల్లో నటించింది పెళ్లయిన తరువాత అని విజయ్ సేతుపతి తెలిపాడు. పెళ్లి అయిన తర్వాత ఈ విషయం ఇంట్లో తన భార్యకు తెలియకుండా సినిమాలలో అవకాశం కోసం ఎదురుచూస్తూ, హీరో అయిన తర్వాత తాను సినిమాల్లో నటిస్తున్నాననే విషయం తన భార్యకి తెలిసిందని చెప్పాడు.తాను సినిమాల కోసం తిరుగుతున్నాననే విషయం తెలియగానే తన భార్య ఎంతో బాధపడినట్టు తెలిపారు. సినిమాలలో డబ్బులు పెద్దగా రాకపోవడంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని తన భార్య చాలా బాధ పడేదని,విజయ్ సేతుపతి ఈ సందర్భంగా తన జీవితంలో చేసిన అతి పెద్ద రిస్క్ గురించి తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -