Friday, April 26, 2024
- Advertisement -

ట్రాన్స్ జెండ‌ర్ గా విజ‌య్ సేతుప‌తి !

- Advertisement -

విజ‌య్ సేతుప‌తి.. కొన్ని రోజుల ముందు నుంచి విప‌రీతంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ న‌టుడు అటు త‌మిళ్, ఇటు తెలుగుతో ఇప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నాడు. త‌మిళ చిత్రం 96 తో ఈ హీరో మంచి పేరును సంపాదించాడు. దాంతో ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయి. అలా వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని వినియోగించుకుని మంచి పేరు సంపాదించాడు.

ఇక ఈ మ‌ధ్యే విడుదలైన ‘ఉప్పెన’లో రాయనంగా విజ‌య్ చేసిన‌ నటన అంద‌రిని ఆక‌ట్టుకుంది. అయితే ఆయన కీలక పాత్రలో త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వంలో అప్ప‌ట్లో ఒక సినిమా చేశారు. అదే త‌మిళ‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’. ఈ సినిమా విభిన్న కథల స‌ముహంగా ఉంటుంది.ఈ సినిమాలో సమంత, ఫాహద్‌ ఫాజిల్‌, రమ్యకృష్ణ, మిస్కిన్‌ తదితరులు న‌టించారు.

2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజ‌యం సాధించింది. అంతేకాకుండ కమర్షియల్‌గా కూడా కాసుల వర్షాన్ని కురిపించింది. ట్రాన్‌జెండర్‌ పాత్రలో విజయ్‌సేతుపతి న‌ట‌న సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రాబోతోంది. సిద్ధేశ్వర వైష్ణవి ఫిల్మ్స్‌ ‘సూపర్‌ డీలక్స్’ సినిమా డబ్బింగ్‌ హక్కులను తీసుకుంది. త్వరలోనే డబ్బింగ్‌ పనులు పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలిపారు. మ‌రి తెలుగులో ఎలా అల‌రిస్తుందో వేచి చూడాలి.

ఏనుగుపై నగ్నంగా ఫొటోల‌కు పోజులిచ్చిన అమ్మ‌డు.. తిక్కను కుదిరించిన నెటిజ‌న్లు!

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉప‌శ‌మ‌నం పొందండి !

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -