చియాన్ విక్రమ్‌కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అపరిచితుడు సినిమాతో తెలుగులో కూడా మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు విక్రమ్.కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటు ముందుకుపోతున్నాడు విక్రమ్. ఇటీవలే సామి-2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.కదరం కొందన్ అనే సినిమాలో నటిస్తున్నాడు విక్రమ్.
ఈ సినిమాను లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మించడం ఒక విశేషం అయితే , ఈ సినిమాలో హీరోయిన్‌గా కమల్ రెండో కూతురు అక్షర హాసన్ నటించడం రెండో విశేషం. విక్రమ్‌ను డిఫరెంట్‌గా చూపుతోన్న ఈ లుక్ కూడా ఆసక్తిని రెకెత్తిస్తోంది. రాజేశ్ సెల్వ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా తనకు మరో హిట్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాడు విక్రమ్.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’