Sunday, May 4, 2025
- Advertisement -

స్కెచ్ వేశాడు సరే.. ప్రేక్షకులు పడతారా

- Advertisement -

చియాన్ విక్రమ్ కు సరైన హిట్ పడటం లేదు. దీంతో తంబి ఇబ్బంది పడిపోతున్నాడు. రావడమే లేట్ గా వచ్చిన కెరియర్ ను ఇప్పడు మళ్లీ నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రయోగాలకు ముందునుంచి ఆసక్తి చూపుతూ దూకుడుగా వ్యవహరించే విక్రమ్… ప్లానింగ్ లో తేడాతో గాడి తప్పేశాడు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని విక్రమ్ స్కెచ్ అనే సినిమాతో రాబోతున్నాడు.

ఇందులో తమన్నా విక్రమ్ కు జతగా నటిస్తోంది. అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చేసింది. టీజర్ లో విక్రమ్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేశాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ గోల చూస్తేనే అర్ధమవుతోంది. ఇన్ని రోజులకి విక్రమ్ కి సరైన పాత్ర దక్కిందని. సౌత్ బాక్స్ ఆఫీస్ కి స్కెచ్ వేశాడు అని ఎవరి స్టైల్ లో వారు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే టీజర్ లో విక్రమ్ స్టైల్ అంత బావుంది.

ఓన్లీ యాక్షన్ లుక్ తోనే కాకుండా లవర్ బాయ్ గాను కలరింగ్ ఇవ్వబోతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్ చందర్ డైరెక్షన్ చేస్తున్నాడు. టీజర్ చూస్తుంటే సినిమా అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఎస్ఎస్.థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2018 జనవరి 12న రిలీక్ కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -