Friday, May 17, 2024
- Advertisement -

దాని కోసం క‌స‌ర‌త్తు చేస్తున్న ‘రంగ‌స్థ‌లం’ జిగేల్ భామ‌

- Advertisement -

సినిమా హీరోయిన్‌గా మారి ఆ త‌ర్వాత అందాలు ఆర‌బోయ‌డానికి ఏమాత్రం అడ్డుచెప్ప‌కుండా సినిమాలు చేస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే. స్టార్ హీరోల స‌ర‌స‌న చేస్తున్న పూజ సినిమాల్లో హాట్‌హాట్‌గా క‌నిపిస్తూ గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మైంది. న‌ట‌న క‌న్నా అందానికి ఎక్కువ చూపించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

కానీ హీరోయిన్‌గా మంచి స‌క్సెస్ పొంద‌డం లేదు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూ కొన్నాళ్లు క‌నిపించి మాయ‌మ‌య్యే మాదిరి క‌నిపిస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి ఇలాగే ఉంది. నాలుగేళ్లల్లో చేసిని సినిమాల‌న్నీ గ్లామ‌ర్‌కే పెద్ద‌పీట వేసింది. డీజేలో అయితే రెండు ముక్క‌ల బ‌ట్ట‌ల‌తో క‌నిపించింది. ఆ ఒక్క సీన్‌తో బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది.

దాని దెబ్బ‌కు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన మూడు సినిమాలు చేసే అవ‌కాశం వ‌చ్చింది. ప్ర‌స్తుతం రామ్‌చరణ్ సినిమాలో జిగేల్ రాణిగా ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే అందాలు మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు చూపించే అవ‌కాశం ఉంది. ఇక త‌ర్వాతి సినిమా కోసం తీవ్ర క‌స‌ర‌త్తులు పూజ చేస్తోంది. బ‌ట్ట‌ల‌ను పైన క‌ట్టేసి వాటిని ప‌ట్టుకొని మెలికలు తిరుగుతూ క‌స‌ర‌త్తు చేస్తున్న వీడియోను పూజ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో విడుద‌ల చేసింది.

గాల్లో ఉండి తాడుపై వేళ్లాడుతూ కూడా అదే స్థాయిలో డ్యాన్స్ చేస్తున్న పూజ తన త‌ర్వాతి సినిమా కోసం క‌ష్ట‌ప‌డుతోందని తెలుస్తోంది.

https://www.facebook.com/PoojaHegde/videos/1875875209098040/

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -