Tuesday, April 23, 2024
- Advertisement -

కోహ్లీకి అవ‌కాశం ఇవ్వ‌కుండానే కోచ్ ప‌ద‌వికి కుంబ్లే రాజీనామా…

- Advertisement -

టీమిండియా ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి కుంబ్లే అనూహ్యంగా రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కెప్టెన్ విరాట్‌తో విబేధాలలు త‌లెత్త‌డంతోనే కుంబ్లే నిర్ణ‌యం తీసుకున్న‌తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో వీరిద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. దీంతోనే కోచ్ ప‌ద‌వికి గుడ్‌బ‌య్ చెప్పాడు. వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టుతోపాటు వెళ్లే అవకాశాన్ని బీసీసీఐ జంబోకి కల్పించింది. కానీ ఆయన మాత్రం ఐసీసీ వార్షిక సమావేశం కోసం లండన్లోనే ఉండిపోయాడు.

కుంబ్లే జట్టుతో కలిసి కరేబియన్ పర్యనటకు వెళ్తాడని అంతకు ముందు బీసీసీఐ ప్రకటించింది. కానీ కోహ్లి సేన బార్బడోస్ విమానం ఎక్కగానే.. నేను విండీస్ పర్యటనకు వెళ్లడం లేదు. కోచ్ పదవి నుంచి వెంటనే తప్పుకుంటున్నా. లండన్‌‌లో జరిగే ఐసీసీ సమావేశానికి హాజరవుతానని కుంబ్లే చెప్పాడు.

టీమిండియా విమానం ఎక్కేంత వరకూ ఓపికగా ఉన్న కుంబ్లే.. ఆ తర్వాతే అసలు విషయం బయటపెట్టాడు. అదే కాకుండా మీడియాతో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. విమాన ప్రయాణంలో ఉండటంతో.. ఈ విషయంలో వెంటనే స్పందించే అవకాశాన్ని కోహ్లికి కూడా ఇవ్వకుండా జంబో తెలివిగా వ్యవహరించాడు.

కోహ్లి విమానం దిగేలోపే కుంబ్లే రాజీనామా, కరేబియన్ పర్యటనకు వెళ్లలేదనే వార్త జనంలోకి వెళ్లింది. కోహ్లి తీరు కారణంగా నొచ్చుకోవడం వల్లే కుంబ్లే కోచ్ పదవి నుంచి నిష్క్రమించాడని బలంగా ప్రచారంలోకి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -