Monday, May 20, 2024
- Advertisement -

లవర్‌తో హాలీడే ట్రిప్‌కి వెళ్లిన విశాల్‌

- Advertisement -

హీరో విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉన్న సంగతి తెలిసిందే. అతను నటించే ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంటది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే విశాల్‌ ఇటీవలే పెళ్లికి రెడీ అయ్యాడని మనందరికి తెలిసిన విషయమే. హైదరాబాద్‌కు చెందిన అనీషాతో విశాల్‌ పెళ్లి ఫిక్స్‌ అయింది. నిశ్చితార్థం కూడా అయిపోయింది. త్వరలోనే మంచి రోజు చూసుకుని పెళ్లి చేసుకోనున్నాడు విశాల్‌. వీరి పెళ్లి ఆగస్టులో జరగనుందని సమాచారం. విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి సినిమాలో అనీషా నటించింది అయితే ఈలోపే కాబోయే భార్యతో హాలీ డే ట్రిప్‌కు చెక్కేశాడు.

అది ఏం‍టీ విశాల్‌ ప్రస్తుతం చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి కదా అనుకుంటున్నారా..? విశాల్‌ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. దీంతో సినిమా షూటింగ్‌లకు కాస్తా గ్యాప్‌ దొరికింది.దీంతో షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చారు. ఈ బ్రేక్‌లో విశాల్‌కి బోర్‌ కొట్టకుండా ఆయన కాబోయే భార్య అనీషా టర్కీలో వాలిపోయారు. ఇద్దరూ హాలిడే టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలను షేర్‌ చేశారు. సుందర్‌. సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో విశాల్‌ గాయపడ్డాడు. ఇక విశాల్‌ నటించిన తెలుగు టెంపర్‌ రీమేక్‌ విడుదలకు రెడీగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -