Tuesday, April 30, 2024
- Advertisement -

హీరోయిన్‌తో ఎఫైర్‌పై స్పందించిన విశాల్!

- Advertisement -

త‌మిళ హీరో విశాల్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు.’అభిమ‌న్యుడు’ సినిమా త‌మిళ్, తెలుగులోను సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.త‌న కెరీర్‌లో మొద‌టి హిట్ ‘పందెం కోడి’ సినిమాకు సీక్వెల్‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు విశాల్‌.ఈ సినిమాలో విల‌న్‌గా సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మి న‌టిస్తుంది.అయితే గ‌త కొంతకాలంగా విశాల్ వ‌ర‌ల‌క్ష్మితో ప్రేమ‌లో ఉన్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.ఈవిష‌యంలో శ‌ర‌త్ కుమార్‌కు విశాల్‌కు మ‌ధ్య గొడ‌వ‌లు అయినట్లు సమాచారం.

తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో దీనిపై స్పందించాడు విశాల్.వ‌రల‌క్ష్మి నేను చిన్న‌ప్ప‌టి నుండి ఫ్రెండ్స్ అని, క‌లిసి చ‌దువుకున్నామ‌నని తెలిపాడు.కష్ట సుఖాలను గురించి ఒకరికి ఒకరం షేర్ చేసుకుంటూ ఉంటామని అన్నారు.మా మ‌ధ్య ఏదో ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని చెప్పుకొచ్చాడు.నేను ఎవ‌రిని ప్రేమించిన ముందు మీకే చెబుతానంటున్నాడు విశాల్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -