తమిళ హీరో విశాల్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.పందెం కోడి సినిమాతోనే తెలుగులో మార్కెట్ ఏర్పడింది విశాల్‌కు.ఈ సినిమా తరువాత విశాల్ నుంచి వచ్చే ప్రతి సినిమా తెలుగులోను విడుదల అవుతుంది.తాజాగా ఆయన నటించిన అభిమన్యుడు సినిమా తమిళంతో పాటు తెలుగులోను మంచి విజయం సాధించింది.విశాల్ ప్రస్తుతం పందెం కోడి-2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాకు కూడా లింగుస్వామియే దర్శకత్వం వహిస్తున్నాడు.
విశాల్‌కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.విలన్‌గా హీరోయిన్ వరలక్ష్మి చేస్తుంది.విశాల్ ఈమెతో ప్రేమలో ఉన్నడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా తెలుగు రైట్స్ మంచి ధర పలికినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ హక్కులను ‘ఠాగూర్’ మధు దాదాపు 10 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తరువాత విశాల్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నాడు.