Friday, May 17, 2024
- Advertisement -

శృంగార తారకు మ‌ద్ద‌తు తెలిపిన స్టార్ హీరో..!

- Advertisement -

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు త‌మిళ స్టార్ హీరో విశాల్‌.సన్నీలియోన్ ప్రధాన పాత్రలో ‘వీరమహాదేవి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని కన్నడ, తమిళ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ఇటీవల బెంగళూరులో సన్నీ లియోన్ పాల్గొన్న ఓ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సైతం కన్నడ సంఘాలు యత్నించాయి.

చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో సన్ని లియోన్ వంటి శృంగార తార నటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.దీనిపై కొంద‌రు ఆమెపై కేసులు కూడా న‌మోదు చేశారు.అయితే ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు విశాల్‌.సినిమా వారిని న‌టులుగానే చూడండి అంటూ విజ్ఞప్తి చేశారు విశాల్‌.ఇక విశాల్ తెలుగు టెంప‌ర్ రీమేక్‌లో న‌టిస్తున్నాడు.ఈ సినిమాలో వ‌చ్చే ఐటెం సాంగ్‌లో సన్నీ లియోన్ న‌టించ‌నుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిఖన్నా న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -