Wednesday, May 1, 2024
- Advertisement -

ఈ దొంగ‌కు తాళాలు అక్క‌ర్లేదు..

- Advertisement -

సాంకేతిక ప‌రిజ్ఞానంతో దొంగ‌త‌నాలు, మ‌న సొత్తును చోరీ చేసేవారికి మీ ఇంటి తాళాలు అవ‌స‌రం లేదంటూ యాక్ష‌న్ కింగ్ అర్జున్ చెబుతున్నారు. విశాల్ హీరోగా నటించిన ‘అభిమన్యుడు’ పీఎస్ మిత్రన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వ‌స్తోంది. హీరోయిన్ సమంత ర‌తీదేవిగా సైకాలజిస్ట్ పాత్రలో కనిపిస్తోంది. ఇటీవ‌ల తెలుగు టీజ‌ర్ విడుద‌ల చేశారు.

‘ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు.. నీ గురించి చిన్న సమాచారం చాలు.. దిస్‌ ఈజ్‌ ద ఇన్‌ఫర్మేషన్‌ ఏజ్‌.. ఇక్కడ ఒక్కో ఇన్‌ఫర్మేషన్‌కు ఓ రేటుంది. ప్రతి ఒక్కరి కంప్యూటర్‌ స్క్రీన్‌ వెనుక ఓ ఇనుప కవచం ఉంది. దాన్ని ఎవరూ తాకలేరు, తెరవనూ లేరు అంటూ అర్జున్ డైలాగ్స్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సినిమా త‌మిళంలో ‘ఇరుంబుతిరై’గా విడుద‌ల‌వుతోంది.

ఆ త‌ర్వాత విశాల్ ఫైట్ చేస్తూ క‌నిపిస్తాడు. స‌మంత ఏదో ప‌రిశీల‌న చేస్తూ.. కొంచెం రొమాన్స్ పండిస్తూ క‌నిపిస్తోంది. ఇక టీజ‌ర్‌లో యాక్ష‌న్ సీన్ల‌యితే అద‌ర‌హో అనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ మోసాల‌పై ఈ సినిమా తీస్తున్నారు. జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -