Friday, May 17, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ మధ్య సం‘బంధం’ ఏంటో తెలుసా?

- Advertisement -

మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావయ్యా అని అడిగితే పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం గుర్తుందా? పెళ్ళి చేసుకోకుండూ ముఫ్ఫై మందితో కలిసుంటే ఒకేనా? రాహుల్ గాంధీతో సహా నేతలందరి అక్రమ సంబంధాల జాతకాలు నా దగ్గరున్నాయి అని చెప్పి ఎదురుదాడి చేశాడు పవన్. అంటే పవన్ సిద్ధాంతం ప్రకారం అక్రమ సంబంధాలు తప్పు. కానీ పెళ్ళిళ్ళు మాత్రం ఎన్నైనా చేసుకోవచ్చన్నమాట. ఆ విషయం పక్కన పెడితే కనీసం అక్రమ సంబంధాల గురించి తనకు తోచినట్టుగా మాట్లాడేసిన పవన్…… ఆ విషయంలో కూడా నిజాయితీగా లేడా? ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో పవన్ వ్యవహారాలపై చాలానే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్‌ని తీసుకోవాలనుకున్నాడు పవన్. ఆ తర్వాత ఆ హీరోయిన్ చాలా సార్లు పవన్ ఫాం హౌస్‌కి వెళ్ళిందని ఆ సినిమాకు వర్క్ చేసినవాళ్ళే చెప్పారు. పవన్ కళ్యాణ్ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ గట్రా నేర్చుకుంటుందని చెప్పారు. పవన్ యాక్టింగ్ గురించి ఆయన ఫ్యాన్స్‌తో పాటు ఆయనకు కూడా బాగా తెలుసు. పవన్‌కి యాక్టింగ్ రాదని ఇతరులకు విమర్శించే అవకాశం ఇవ్వకుండా తనకు యాక్టింగ్ రాదని పవనే స్వయంగా ఒప్పుకుంటూ ఉంటాడు. అలాంటి పవన్ ఇతరులకు యాక్టింగ్ కోర్సులు నేర్పించడం అంటే హాస్యాస్పదంగా లేదు. అసలు విషయం పెరుమాళ్ళకెరుక అనాలేమో.

ఇక తాజాగా పూనం కౌర్ వ్యవహారం బయటికి వచ్చింది. మహేష్ కత్తిపై పవన్ ఫ్యాన్స్‌తోపాటు పవన్ కూడా కత్తిగట్టినట్టుగా ద్వేషం వెదచల్లుతుండడంతో తన అస్తిత్వం కోసం పోరాడుతున్నాడు మహేష్ కత్తి. మహేష్ కత్తి మాటలను పవన్ కూడా ద్వేషంతో పోలుస్తూ తన ఫ్యాన్స్‌ని ఇంకాస్త రెచ్చగొట్టింది నిజం. ఇక ఆ తర్వాత నుంచీ పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ కత్తి భార్య, కూతురు, తల్లి, అక్కాచెల్లల్లను అత్యంత దారుణమైన మాటలతో అనాగరిక ప్రవర్తనతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇక మహేష్ కత్తిని చంపేస్తాం అంటూ బెదిరింపులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నాయి. అందుకే మహేష్ కత్తి కూడా పవన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. అందులో ఆలోచన రేకెత్తించేవి కూడా ఉంటున్నాయి. తనను ఫ్యాట్సో అంటూ ఎటకారం చేసిన పూనం కౌర్‌పై తాజాగా మహేష్ కత్తి విమర్శలు చేశాడు.

పూనం కౌర్‌ని ఆంద్రప్రదేశ్‌కి సంబంధించిన ఒక విభాగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించమని పవన్ సిఫారసు చేశాడు. చంద్రబాబు నియమించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని మహేష్ కత్తి ప్రశ్నిస్తున్నాడు. ఏ అర్హతలు ఉన్నాయని పూనం కౌర్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించమని పవన్ సిఫారసు చేశాడు? అసలు ఆంద్రప్రదేశ్‌కి పూనం కౌర్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఇక ఎప్పుడో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే తక్కువ స్థాయికి పడిపోయిన పూనం కౌర్‌కి ఏం బ్రాండ్ వ్యాల్యూ ఉందని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు? అని ప్రశ్నించిన మహేష్ కత్తి మరోసారి తన జోలికొస్తే పవన్‌కి పూనం కౌర్‌కి ఉన్న అసలు సంబంధాలను బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించాడు. పవన్‌కి-పూనం కౌర్‌కి మధ్య ఉన్న సంబంధం గురించి వివరాలన్నీ బయటపెట్టానంటే ఆ తర్వాత పవన్ ప్రజల్లోకి రావడానికి కూడా సిగ్గుపడతాడని మహేష్ కత్తి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పవన్-పూనం కౌర్‌ల మధ్య ఉన్న సం‘బంధం’ గురించి చర్చోపర్చలు నడుస్తున్నాయి. మహేష్ కత్తి హెచ్చరిక తర్వాత పూనం కౌర్ కూడా పూర్తిగా సైలెంట్ అవ్వడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -