Monday, April 29, 2024
- Advertisement -

మ‌రో అదుర్స్‌, దూసుకెళ్తాలాంటి సినిమా

- Advertisement -

అదుర్స్‌, దూసుకెళ్తా మాదిరి ఓ సినిమా రాబోతోంది. మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా వ‌స్తోంది. ఆచారి అమెరికా యాత్ర సినిమా టీజర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. బ్రహ్మానందం కీలక పాత్రతో ఈ సినిమా కొన‌సాగుతుంద‌ని క‌నిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అనూప్ సింగ్ థాకూర్ విల‌న్‌గా నటిస్తున్నాడు.

పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మాణంలో వ‌స్తున్న ఈ సినిమా మ‌రో కామెడీ సినిమాగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను మంచు విష్ణు త‌న ట్విట‌ర్‌లో విడుద‌ల చేశారు. డ‌బ్బు కోసం అమెరికా వెళ్దాం ఆచారిగారు.. ఇక్క‌డ రూపాయి.. అక్క‌డ డాల‌ర్లు సంపాదించొచ్చు అంటూ విష్ణు అంటుండ‌గా బ్ర‌హ్మానందం అమెరికా యాత్ర‌కు అంగీక‌రించి వెళ్తాడు. అక్క‌డ వెళ్లిన ప‌ని వేరు.. విష్ణు చేసే ప‌ని వేరుగా ఈ సినిమా టీజ‌ర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో కామెడీ మేళ‌వించి సినిమా తీస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు ఈ సినిమా జరుపుకుంటోంది. సినిమా నిర్మాణ‌ప‌రంగా క్వాలిటీగా క‌నిపిస్తోంది. ప్ర‌గ్యాజైస్వాల్ అందంగా క‌నిపించింది. కోట శ్రీనివాస‌రావు, వేణు త‌దిత‌రులు ఈ సినిమాలో ఉన్నారు.

అయితే మ‌రోసారి బ్రాహ్మ‌ణ ఇతివృత్తంలో సినిమా వ‌స్తోంది కావున గ‌తంలో మాదిరి వివాదాలు చుట్టుముట్టుకునే అవ‌కాశం ఉంది. ఆ సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌ర‌కుంటే సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేక‌పోయే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -