Saturday, May 4, 2024
- Advertisement -

నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్‌లో సింధు గెలుపు

- Advertisement -

తెలుగు బిడ్డ మ‌ళ్లీ మెరిసింది. ఒలంపిక్స్ నుంచి అజేయంగా కొన‌సాగుతున్న సింధు మ‌రో మంచి విజ‌యాన్ని అందుకుంది. మహిళల సింగిల్స్‌తో పాటు నిర్ణయాత్మక మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోరులో పీవీ సింధు రాణించింది. దీంతో చెన్నై స్మాషర్స్‌ విజయం సాధించింది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్ (పీబీఎల్‌)‌లో శనివారం (జనవరి-6) చెన్నై స్మాషర్స్‌ జట్టు 2-1తో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌పై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15-11, 10-15, 15-12తో ప్రపంచ నంబర్‌వన్‌ తైజు యింగ్ (అహ్మదాబాద్‌)పై గెలిచింది. చెన్నై చివరి రెండు మ్యాచ్‌లలో పుంజుకుని పోరులో విజేతగా నిలిచింది.

సింగిల్స్‌కు తోడు మిక్స్‌డ్‌లో విజృంభించడంతో పీబీఎల్‌లో చెన్నై స్మాషర్స్ అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌పై గెలుపొందింది. తొలుత మహిళల సింగిల్స్‌లో సింధు ప్ర‌పంచ నంబర్‌వన్‌ థాయ్‌ జూ యింగ్‌ను చిత్తుచేసింది. ఆ తర్వాత సుమిత్‌ రెడ్డి జతగా సింధు మిక్స్‌డ్‌ మ్యాచ్‌లో కమిల్లా- లీ జంటను ఓడించింది. ఇక రెండో పురుషుల సింగిల్స్‌లో సేన్నొబున్సాక్‌తో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై గెలిచి చెన్నై ఆధిక్యాన్నిపెంచాడు. అహ్మదాబాద్‌ తరపున పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ, పురుషుల డబుల్స్‌లో నందగోపాల్‌-రెగినాల్డ్‌ జోడీ గెలుపొందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -