Thursday, April 18, 2024
- Advertisement -

విష్ణుకి ‘మోసగాళ్ళు’ కలిసి వస్తుందా…!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచారు. ప్రముఖ విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.. కానీ సక్సెలు మాత్రం వారి తలుపు తట్టలేదు. మంచు మనోజ్ కి మంచి క్రేజ్ ఉన్నా.. విష్ణు మాత్రం సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’ ఒక్కటే విష్ణుకి బిగ్గెస్ట్ హిట్. చాలా రోజుల తర్వాత మంచు విష్ణు, రూహీ సింగ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ మోసగాళ్ళు’. యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది…ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ ట్రైలర్ దాదాపు 2600 కోట్ల స్కామ్ చేసి ఇండియన్ ఎకానమీని దెబ్బ కొట్టిన ముఠాను పట్టుకునే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతోంది. ట్రైలర్ లో చూపించ సన్నివేశాలన్నీ కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తున్నాయి. జెఫ్రీ గీ చిన్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం మంచు విష్ణు కి బాగానే కలిసి వస్తుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -