Saturday, May 18, 2024
- Advertisement -

రెమ్యూన‌రేష‌న్‌లో చ‌ర‌ణ్‌కు పోటీగా విల‌న్‌

- Advertisement -

సినిమా అంటే హీరో, విలన్‌ల మ‌ధ్య కొట్లాట‌. టామ్ అండ్ జెర్రీ మాదిరిగా సినిమాలో హీరో, విల‌న్లు ఉంటే ఆ సినిమా అంత ర‌స‌వ‌త్త‌రంగా.. హిట్‌గా నిలుస్తుంది. హీరోతో పాటు విల‌న్ పాత్ర కూడా బ‌లంగా ఉంటుంది. హీరోను తీర్చిదిద్దినంత ఆస‌క్తిగా విల‌న్‌ను కూడా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు, క‌థ ర‌చ‌యిత‌లు ప్ర‌త్యేకంగా క‌స‌ర‌త్తు చేస్తారు. అయితే ఇప్పుడు ఒక సినిమాలో విల‌న్ పాత్ర కోసం హీరోకు త‌క్కువ కాకుండా రెమ్యున‌రేష‌న్ ఇవ్వనున్నారు. స్టార్ హీరోకు ఇచ్చేంత పారితోష‌కం త‌న‌కు ఇవ్వాల‌ని కోరుతున్నాడ‌ని స‌మాచారం.

ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విల‌న్ పాత్ర బ‌లంగా ఉండ‌నుంది. విల‌న్ కోసం స్పెషల్‌గా కొన్ని సీన్లను కూడా రాసుకున్నారు. రాంచరణ్‌తో బోయపాటి ఒక మాస్ కథను ఒకే చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కథలో విలన్ పాత్ర చాలా కీలకమట. ఈ విల‌న్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ న‌టిస్తున్నారు.

వివేక్‌కు పాత్ర చాలా నచ్చిందట. కానీ పాత్ర చాలా వైలెంట్ గా ఉండడంతో కొంచెం ఎమౌంట్ కూడా గట్టిగానే అడిగాడని తెలుస్తోంది. దాదాపు మన దగ్గర మీడియం హీరోలు తీసుకునే రేంజ్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశాడని స‌మాచారం. దీంతో నిర్మాతలు మొదట ఆలోచించిన దర్శకుడిని నమ్మి ఒకే చేశారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీ న‌టిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -