Saturday, May 4, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌తో పెట్టుకున్న కౌశ‌ల్ ఆర్మీ

- Advertisement -

బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్‌కు మ‌ద్ద‌తుగా ఏర్ప‌డింది కౌశ‌ల్ ఆర్మీ.బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో కౌశ‌ల్‌ను ఒంట‌రిని చేసి మిగ‌త ఇంటి స‌భ్యులంద‌రు గేమ్ ఆడుతుంటే అతనికి మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో ఈ కౌశ‌ల్ ఆర్మీ గ్రూప్ క్రియేట్ అయింది.కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిల‌వ‌డంలో ఈ కౌశ‌ల్ ఆర్మీ కీల‌క పాత్ర‌ను పోషించింది.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది.సోష‌ల్ మీడియాలో కౌశ‌ల్ ఆర్మీ ఆగ‌డాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి.ఈ రోజు టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు.దీంతో ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

అయితే ప్రభాస్ అభిమానుల కంటే కౌశల్ ఆర్మీ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది కౌశల్ ఆర్మీ. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పే క్రమంలో కొంతమంది మధ్య‌ మాటా మాటా పెరిగింది. దాంతో ప్రభాస్ కంటే కౌశల్,ఆయన కౌశల్ ఆర్మీ గ్రేట్ అంటూపోస్ట్ లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో ఆ ప్రభావం బాగానే కనపడుతోంది. దాంతో ఇదే మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మ‌రి వివాదం ఎంత దూరం వెళ్తూందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -