Sunday, May 5, 2024
- Advertisement -

రోహిత్ శ‌ర్మ మ‌రో సిక్స్ కొట్టి ఉంటే….!

- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ శతకంతో చెలరేగిపోయాడు టీం ఇండియా ఒపెన‌ర్‌ రోహిత్‌ శర్మ . రోహిత్‌ శర్మ మరో రికార్డును సమం చేసేందుకు అడుగుదూరంలో నిలిచాడు. గత మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన రోహిత్‌.. మరో సిక్సర్‌ కొడితే భారత్‌ తరపున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ సరసన చేరతాడు.

ఇప్పటివరకూ వన్డేల్లో 194 సిక్సర్లు కొట్టిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ సిక్సర్ల రికార్డును చేరేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో సచిన్‌ 195 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, రోహిత్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీ (190)ను రోహిత్‌ వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -