Monday, April 29, 2024
- Advertisement -

మెగా ప్లాన్ ఫెయిల్ – మెగా హీరోల్లో ఫైర్

- Advertisement -

మెగా హీరోలు ఈ రెండు నెలల్లో తమ సత్తా చూపాలని, టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేయాలని… స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. దీని కోసమని మెగా హీరోలు మెగా స్కెచ్చే వేసేశారు.

అయితే ఆ స్కెచ్ లో ఉన్న లోపంతో ….మెగా హీరోలు తమలో తామే  చిచ్చు పెట్టుకునేలా విషయం మారిపోయింది. దీనికి కారణం లైన్లో సాయిధరమ్ ,అల్లు అర్జున్ ,వరుణ్ తేజ్ ,చెర్రీలు మన ముందుకు వస్తూ ఉండడమే. కేవలం వారం రెండు వారాలు గ్యాప్ లో వీరి చిత్రాలు వస్తూ ఉండడంతో..  ఒకరి చిత్రాలతో ఒకరు క్లాష్ అయ్యేలా కనిపిస్తుంది. సెప్టెంబర్ 24న సాయిధరమ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ వస్తుంటే…అక్టోబర్ 2న వరుణ్ తేజ్‌  ‘కంచె’ విడుదల చేస్తున్నాడు.

ఇక చెర్రీ దసరాకు  బ్రూస్ లీ గా ఎంట్రీ ఇస్తానంటున్నాడు. ఈ మధ్యలో బన్నీ గోనగన్నారెడ్డిగా స్పెషల్ రోల్ చేసిన రుద్రమదేవి చిత్రం…. అక్టోబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరి ఇదే డేట్స్ తో రేపన్న  రోజు మెగా సినిమాలు రిలీజ్ అయితే క్లాష్ అవ్వడం ఖాయం. అది కాకుండా ఉండాలంటే మరోసారి మెగా మీట్ జరిగి  సినిమా సినిమాకు మధ్య గ్యాప్ కాస్త ఎక్కువగా ఉండేలా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -