ఏపీలో పలు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీలు, అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు గా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని నియమించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శి (అనుబంధ విభాగాలు)గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు.
అలాగే వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను,బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబును నియమించారు. చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని ,విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌ఛార్జ్ గా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు.
టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని ఇంఛార్జీగా తొలగించి పేరడా తిలక్‌ను నియమించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట కారు షెడ్ లోనే ఆయన సతీమణి దువ్వాడ వాణి, కుమార్తెలు చేస్తున్న నిరసన 16వ రోజుకు చేరుకుంది. శ్రీనివాస్ మాత్రం తనకు విడాకులే కావాలని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను మారుస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
