Saturday, May 18, 2024
- Advertisement -

చిక్కిపోయిన దేవ‌సేన‌

- Advertisement -
  • ఫేస్‌బుక్‌లో అనుష్క ఫొటో పోస్ట్‌

సైజ్ జీరో సినిమాలో దొడ్డుగా క‌నిపించిన అనుష్క ఆ త‌ర్వాత సోగ్గాడే చిన్నినాయ‌నా, బాహుబ‌లి ఒక‌టి, రెండు సినిమాల్లో చిక్కి అందంగా క‌నిపించింది. ఇప్పుడు ఇంకా చిక్కేసి త‌న మొద‌టి సినిమా సూప‌ర్‌లో ఉన్న మాదిరిగా అనుష్క త‌యారైంది. పూర్తిగా స‌న్న‌బ‌డి అనుష్క చ‌క్క‌ని బొమ్మ‌గా త‌యారైంది. అలాంటి ఫొటోను త‌న ఫేస్‌బుక్‌లో అనుష్క శెట్టి పోస్టు చేశారు.

అనుష్క ఈ ఫొటోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ‘ఏదో అద్భుతం జరగడం వల్ల కలలు నెరవేరవు.. దాని కోసం చెమట చిందించాలి, అంకితభావంతో కృషి చేయాలి’ అని ఆమె రాశారు. ఈ ఫొటో చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా అంకితభావంతో పనిచేస్తున్నారు, సూపర్‌, క్యూట్‌ స్వీటీ.. అంటూ తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ‘బాహుబలి 2’ తర్వాత అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను జి. అశోక్ తీస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈ సినిమా రాబోతోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -