Sunday, May 5, 2024
- Advertisement -

స్టార్ పుణ్యమాని సూపర్ రించ్ రేంజ్‌కి మెగాబ్రదర్

- Advertisement -

ఆరెంజ్ సినిమా ఆ రేంజ్‌లో ఆడుతుంది అనుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా బోల్తా కొట్టేసి నాగబాబును ముంచేసింది. ఆ టైంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌లిద్దరూ కూడా నాగబాబుకు అండగా ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు నాగబాబుకు స్టార్ కలిసొచ్చింది. ఒకప్పుడు అన్నీ నష్టపోయి ఫెయిల్యూరర్‌గా నిలిచిపోయిన నాగబాబు…… ఇప్పుడు సూపర్ సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా నిలిచాడు.

స్టార్ మాలో నాగబాబు షేర్ 39 కోట్లు వచ్చింది. ఆ వెంటనే ఆరెంజ్ టైంలో పవన్ ఇచ్చిన 3 కోట్లు తిరిగి ఇచ్చేశాడు నాగబాబు. ఇక ఫిదా, తొలిప్రేమ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇప్పుడు సినిమాకు నాలుగు కోట్లు తీసుకుంటున్నాడు. మరోవైపు నిహారిక సంపాదన కూడా బాగానే ఉంది. అన్నింటికీ మించి ఒక్క జబర్ధస్త్ షోతోనే సంవత్సరానికి ఐదు కోట్లు సంపాదిస్తున్నాడు నాగబాబు. జబర్దస్త్ షోతో నెలకు 40లక్షలు సంపాదిస్తున్న నాగబాబు సంవత్సరానికి దాదాపు ఐదు కోట్లు వెనకేసుకుంటున్నాడు. ఆ రకంగా ఆరెంజ్ సినిమా టైంలో పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన నాగబాబు……ఇప్పుడు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారికల సంపాదనతో పాటు తాను కూడా సంపాదిస్తూ సూపర్ రిచ్ స్థాయికి ఎదుగుతున్నాడు. వాట్ ఎ సక్సెస్ ఫుల్ విన్నింగ్ స్టోరీ అని నలుగురి చేతా ప్రశంశలు పొందే స్థాయికి మెగా బ్రదర్ ఎదుగుతూ ఉండడం మెగా ఫ్యామిలీ మొత్తానికి ఆనందాన్ని ఇచ్చే విషయమే అనడంలో సందేహం లేదు. కీప్ రాకింగ్ నవ్వుల స్టార్ నాగబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -