Sunday, May 19, 2024
- Advertisement -

‘ఆంధ్రజ్యోతి ప్రభుత్వమే’….. అయితే తప్పేంటి? నిర్భయంగా నిజాన్ని ఒప్పేసుకున్న చంద్రబాబు

- Advertisement -

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా? ఆంధ్రజ్యోతి ప్రభుత్వమా? ఈ సందేహం చాలా సందర్భాల్లో చాలా మందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే సిఎం చంద్రబాబు ఎప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో? ఏం ఆలోచిస్తున్నారో సవివరంగా ఆంధ్రజ్యోతిలో వస్తూ ఉంటుంది. ప్రజల్లో ఉన్న ఎన్నో సందేహాలకు చంద్రబాబు పేరు మీద ఆంధ్రజ్యోతినే వివరణ ఇస్తూ ఉంటుంది.

కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత 14రోజుల వరకూ బడ్జెట్‌పై మీడియా ఎదుట కానీ, బహిరంగసభలు, సమావేశాల్లోకానీ స్పందించిందే లేదు. అయితేనేం చంద్రబాబు అభిప్రాయాలు, ఆలోచనలు, బాబు వేసిన రంకెలు, ఆయన పడిన ఆవేశం అంతా రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు సారథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటకాన్ని రాధాకృష్ణ కళ్ళతోనే చూశారు. ఆ 14 రోజులూ కూడా చంద్రబాబు బ్యాక్ గ్రౌండ్‌లో ఉంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫోర్ గ్రౌండ్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాబు తరపున ఎన్ని విషయాలతో కథనాలు వండి వడ్డించాడన్నది నిజం. కేంద్రం ప్రవేశ పెట్టిన చివరిబడ్జెట్‌లో కూడా ఎపికి చిప్ప చూపించిన నేపథ్యంలో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన, ముందుండి నడిపించాల్సిన ప్రభుత్వాధినేత అజ్ఙాతంలో ఉండిపోతే……. అన్నీ తానై పోరాటకాన్ని నడిపించాడు రాధాకృష్ణ. ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత ఇరుక్కోకుండా కెసీఆర్‌తో సంబంధ బాంధవ్యాలు బలపడేలా చేసింది రాధాకృష్ణనే అన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని ఆయన కూడా చాలా గర్వంగా చెప్పుకున్నాడు.

ఇప్పుడు తాజాగా అధికారికంగా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలో…….. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటన అనే స్థానంలో ‘ఆంధ్రజ్యోతి ప్రభుత్వం’ ఇస్తున్న ప్రకటనగా చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. విమర్శకులు, మేధావులు, ఆలోచనాపరులయిన నెటిజనులు షరామామూలుగా చంద్రబాబును విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. కానీ ఒకరకంగా చూస్తే మాత్రం బాబుని అభినందించాలి. అబద్ధాలు చెప్పడంలో బాబు ఏస్థాయి ప్రావీణ్యం సంపాదించాడో చెప్పనవసరం లేదు. అలాంటి చంద్రబాబు మొట్ట మొదటి సారి ‘ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు….. ఆంధ్రజ్యోతి ప్రభుత్వం’ అని నికార్సయిన నిజాన్ని ఒప్పేసుకుంటే అభినందించాలి కానీ విమర్శలతో విరుచుకుపడడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాక్ అయ్యారు అని హెడ్డింగులు పెట్టడం ఏంటి? అయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడో తెలుసు…….నడుస్తున్నది బాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు………రాధాకృష్ణ సారథ్యంలో ‘ఆంధ్రజ్యోతి ప్రభుత్వం’ అని. ఇన్నాళ్ళకు ఆ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా డైరెక్ట్‌గా ఒప్పుకోవడం నిజంగా గొప్పవిషయం. కాదంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -