Saturday, May 11, 2024
- Advertisement -

శ్రీదేవి మరణం….. దుబాయ్ ప్రభుత్వం నుంచీ ఎక్స్‌క్లూజివ్ ఫ్యాక్ట్స్

- Advertisement -

ప్రస్తుతం సమాజాన్ని అత్యంత ఘోరంగా హింసిస్తున్న వ్యవస్థ మీడియానే అని చెప్పడంలో సందేహం లేదు. పూర్తిగా కాసులకు కక్కుర్తిపడే కొంతమంది మీడియాను నడిపిస్తున్నారు. స్వార్థ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల విషయంలో అండగా నిలిచే నాయకుడిన ఒక్కడినీ ఆకాశానికి ఎత్తుతూ వార్తలు అందిస్తూ ఉండడం…… అతని ప్రత్యర్థి నాయకుడిని పాతాళానికి తొక్కేసేలా వార్తలు రాసే విషయాలను పక్కనపెడితే ఇప్పుడు ఇతర అన్ని విషయాల్లోనూ అత్యంత నీచంగా వ్యవహరిస్తోంది మీడియా. కేవలం కాసుల కక్కుర్తి కోసమే…… వ్యూయర్‌షిప్ కోసం చనిపోయిన శ్రీదేవిని మళ్ళీ హత్య చేసింది. కుటుంబానికి పెద్ద దిక్కులా…. భర్తకు, ఇద్దరు ఆడపిల్లలకు అన్నీ తానై వ్యవహరించిన శ్రీదేవి చనిపోవడంతో దుఃఖ సాగరంలో ఉన్న ఒక కుటుంబాన్ని మానసికంగా హత్య చేస్తూనే ఉంది మీడియా.

తాజాగా దుబాయ్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం బయటికి వచ్చింది. దుబాయ్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నిజాలు ఏంటంటే అక్కడ చట్టాలు మన దగ్గర ఉన్నట్టు ఉండవు. శిక్షలు కూడా భారీగా ఉంటాయి. ఎడారి దేశం కావడంతో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా దుబాయ్ శిక్షాస్మృతిని కఠినంగా రూపొందించారు. ముస్లిం దేశాలలో శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. విచారణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. శ్రీదేవిది సహజ మరణం అన్నది ముమ్మాటికీ నిజం. అయినప్పటికీ హత్య అయ్యే అవకాశం ఒక్క శాతం ఉన్నా, అస్సలు అలాంటి అవకాశమే లేకపోయినా సరే…… దుబాయ్ ప్రభుత్వం మాత్రం విచారణ విషయంలో రాజీపడదు. ఆ విషయం మన మీడియా జనాలు అందరికీ తెలుసు. అది తెలియకపోతే అసలు వాడు జర్నలిస్టే కాదు. ఇప్పుడు శ్రీదేవి మరణంపై కూడా దుబాయ్ ప్రభుత్వం అదే స్థాయిలో విచారించింది. అయితే శ్రీదేవి గురించి రాసిన వార్తలకు వ్యూయెర్‌షిప్ బాగా వస్తుండడంతో జాతీయ స్థాయి మీడియా, తెలుగు మీడియా అనేదానితో సంబంధం లేకుండా శవాలపైన పేలాలు ఏరుకోవడం కాదు……. అంతకంటే అథమస్థాయిలో…… ప్రవర్తించారు మీడియా జనాలు. చనిపోయిన శ్రీదేవిని మళ్ళీ చంపేశారు. ఆమె ఇమేజ్‌ని చంపేశారు. ఇక బోనీ కపూర్ కుటుంబాన్ని, శ్రీదేవి ఇద్దరు కూతుర్లను మానసికంగా చంపేస్తూనే ఉంది మీడియా. ఇప్పుడు తాజాగా శ్రీదేవిది సహజ మరణమే అని, హత్యతాలూకూ ఆనవాళ్ళు ఏమీ లేవని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి మన మీడియా ఇప్పుడైనా మానవత్వం చూపిస్తారా? మేం తప్పు చేశాం అని ఒప్పుకుంటారా? శ్రీదేవిని హత్య చేసిన బోనీ కపూర్ అనే స్థాయిలో వార్తలు రాసిన జాతి జర్నలిస్టులందరూ ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతారా? మనుషులకుండే అలాంటి లక్షణాలు ఉండి ఉంటే ఇంత అమానవీయంగా ఎలా ప్రవర్తించగలరు? రెస్ట్ ఇన్ పీస్ మీడియా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -