Friday, April 26, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడు?

- Advertisement -

విజయ్ దేవరకొండ ఇటీవలే డియర్ కామ్రేడ్ అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు. కానీ అనూహ్యం గా ఈ సినిమా ఆశించిన విధం గా ఆడకపోవడటం తో విజయ్ దేవరకొండ సైలెంట్ అయిపోయాడు. సాధారణం గా సోషల్ మీడియా లో హడావుడి చేస్తూ కనిపించే విజయ్, సినిమా విడుదల అయిన రెండో రోజు నుంచే సైలెంట్ అయిపోయాడు. బయటకి రాకుండా, ఏం చేస్తున్నాడో తెలియనియ్యకుండా జాగ్రత్త పడుతున్నాడు విజయ్. కాకపోతే విజయ్ దేవరకొండ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయం మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే విజయ్ మామూలోడు కాదు, మౌనం గా ఉన్నాడు అంటే ఏదో చేయాలనే తపన తో ముందుకు వెళ్తున్నాడు అని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే, విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ సినిమా తో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నాడు. విజయ్ ఈ సినిమా ఇలా పరాజయం పొందుతుంది అని అస్సలు అనుకోలేదు. అందుకే ఎలాగైనా ఈ సినిమా నుంచి త్వరగా బయటకి వచ్చి మిగిలిన విషయాలు చక్కబెట్టుకోవాలని అతనికి కొంత మంది సూచన చేస్తున్నారు.

అయితే ఇంతటి పరాజయం తర్వాత రానున్నాడు కాబట్టి, విజయ్ దేవరకొండ నుంచి త్వరలో రానున్న ప్రకటన ఎలా ఉండబోతుంది అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -