Monday, April 29, 2024
- Advertisement -

ధోనీకి దక్కనున్న మరో అరుదైన గౌరవం….

- Advertisement -

టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. రెండు నెలలు క్రికెట్ ను పక్కన పెట్టిన ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతలకు నెలవైన కశ్మీర్ లోయలో సాధారణ సైనికుడిలా విధి నిర్వహణ చేపట్టాడు.

పారా మిలిటరీలోని పారాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీకి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కనుంది. జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డ లడఖ్‌లో జాతీయ జెండా ఎగుర వేయనున్నాడు. ఆగస్టు 15న లడఖ్‌లోని లేహ్ పట్టణంలో మువ్వన్నెల జెండా ఎగువవేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పుల్వామాలో విధులు నిర్వహిస్తున్న ధోని.. తన బెటాలియన్‌తో కలిసి రేపు లేహ్‌కు వెళ్లనున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -