నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా?

- Advertisement -

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత నాగ్ అశ్విన్ ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూసిన తరుణం లో మహానటి అనే సినిమా తో వచ్చి అందరినీ ఎంతగానో అలరించాడు అయితే ఈ సినిమా విజయం నాగ్ అశ్విన్ కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది. మహానటి సినిమా తో నాగ్ అశ్విన్ తన కెరీర్ సెట్ చేసుకోవడమే కాకుండా కీర్తి సురేష్ కెరీర్ ని కూడా సెట్ చేసేసాడు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు ఏ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అనే విషయం క్లారిటీ లేదు. అందరూ ఏం సినిమా చేస్తాడా అని ఎదురు చూస్తుంటే, నాగ్ అశ్విన్ ఒక ప్రతిష్టాత్మక సినిమా నే ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

అయితే జగదేకవీరుడు అతిలోక సుందరి అనే సినిమా ని మన తెలుగు ప్రేక్షకుల అభిరుచుల కి తగ్గట్టు గా ఈ కొత్త జెనరేషన్ కి నచ్చేలా తీర్చిదిద్దాలని అప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా తో నే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -