Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ హీరోలంతా కేక: రకుల్ ప్రీత్ షింగ్

- Advertisement -

ఇప్పుడు టాలివుడ్‌ లో నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న అందాల భామ రకుల్ ప్రీత్ షింగ్ తను పని చేసిన హీరోల గురించి ఇలా అంటోంది.

హీరో రవి తేజ:

రవితేజ నేనూ ఇంచు మించు ఒకటే. మా ఇద్దరి అభిరుచులు ఎంతో సారూప్యం ఉంటుంది. వర్కవుట్లు, ఎనర్జీ లెవెల్స్, అన్నీ ఒక్కటే.

హీరో రామ్: 

 రామ్ సూపర్ ఎనర్జిటిక్, చాలా స్పాంటేనియస్ గా ఉంటాడు. మూడ్ వెంట వెంటనే ఛేంజ్ చేయగలడు. ఎటువంటి సన్నివేశాన్ని అయినా అలవోకగా చేసేస్తాడు. ఈజీ గోయింగ్.

హీరో మంచు మనోజ్: 

మంచు మనోజ్ లొకేషన్‌లో ఉంటే సందడి సందడి గా ఉంటుంది. అతను వేసే జోక్స్‌కి పొట్ట చెక్కలు కావాల్సిందే.

 హీరో సందీప్ కిషన్:

సందీప్‌ కిషన్ పని రాక్షసుడు అతను ఏం మాట్లాడినా సినిమా గురించే మట్లాడతాడు, సినిమా గురించే ఆలోచిస్తాడు. అతని దృష్టి అంతా సినిమాల పైనే ఉంటుంది. 

హీరో గోపీచంద్:

 గోపి చంద్ కామెడి అయినా సీరియస్ అయినా బ్యాలెన్స్‌డ్ గా ఉంటాడు. అతన్ని చూసి నేను చాలా నేర్చుకున్నా..

  అని తన సహ నటులపై ప్రశంసల వర్షం కురిపించింది ఈ భామ. చాలా తక్కువ సమయంలో టాలివుడ్ లో నంబర్ హీరోయిన్ స్థాయికి ఎదిగి, టాప్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. బ్రహ్మోత్సవం సినిమాలో హీరోయిన్‌గా మహేశ్ బాబు సరసన నటిస్తోంది. ఇంకా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న మరో మూవీలో కూడా ఈ సుందరే హీరోయిన్ గా చేస్తోందని సమాచారం.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -