Monday, May 13, 2024
- Advertisement -

ఆ టూర్ తరువాత ఓటుకు నోటుపై పవన్ కళ్యాణ్ స్పందన?!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ సమయంలో టిడిపి ప్రభుత్వానికి మద్దతు పలికి, అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించారు. అప్పుడు ప్రశ్నిస్తా అని  జన సేన పార్టీని కూడా ఆవిర్భవించారు. ఇప్పుడు అదే పెద్ద వివాదం అవుతోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఓటుకు నోటు కేసు వ్యవహారం రాజకీయంగా, అత్యంత కీలకంగా మారి ఢిల్లీ స్థాయికి చేరింది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ స్పందించక పోవడంపై తీవ్ర విమర్శలు ఆయనపై వస్తున్నాయి. ఇంకా పది రోజుల పాటు ఈ విషయంపై స్పందించక పోవచ్చని సమాచారం. ఎందుకంటే ఆయన ఇప్పుడు విదేశాలలో ఉన్నారని సమాచారం.ఓటుకు నోటు కేసులో టిడిపిపై ఆరోపణలు, ఆయా పార్టీ నేతల మాటలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం అటు అభిమానులు, ఇటు జనసేన కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు స్పందించక పోతే మనపై తీవ్ర విమర్శలు వస్తాయని ఆయన సన్నిహిత వర్గాలు సూచించినా ఆయన ఇండియా వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తానని చెప్పినట్లు సమాచారం. దీని కోసం కనీసం పత్రికా ప్రకటన చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.   ఆయన ఇండియాకి రావడానికి ఇంకా పది రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు. పది రోజుల వరకు ఇలానే ఉంటే  అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీ నేతల విమర్శలను చవి చూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎలక్షన్ సమయంలో ప్రశ్నిస్తా..! అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.     

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -