Saturday, May 18, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కు ఇష్ట‌మైనా మ‌హేష్ సినిమా ఏదో తెలుసా?

- Advertisement -

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మొన్న జ‌రిగిన భ‌ర‌త్ అను నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హ‌జ‌రై అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను ప్రీ రిలీజ్ ఎల్‌బీ స్టేడియంలోచాలా గ్రాండ్‌గా జ‌రిగింది.ఇంక చెప్పాలంటే క‌నుల పండుగగా జ‌రిగింది.‘భరత్‌ అనే నేను బహిరంగ సభ’లో ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ మీరు ఆయనని ‘ప్రిన్స్‌’, ‘సూపర్‌స్టార్‌’ అంటారు. నేను మహేష్‌ అన్నా అని పిలుస్తాను అన్నారు.మ‌హేష్ చేసినన్ని ప్రయోగాత్మక చిత్రాలూ ఎవరూ చేయలేదు.హిట్‌,ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మాటకు కట్టుబడి ఆయన చేసిన ప్రయోగాలను ఇప్పుడిప్పుడే మేము మొదలు పెడుతున్నాం. ఈ విషయంలో ఆయనే మాకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌.

ఇంత‌కు తార‌క్‌కి ఇష్ట‌మైనా మ‌హేష్ బాబు సినిమా ఏదో తెలుసా. 1 నేనోక్కిడినే … అవునండీ నిజ‌మే సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికి ఇందులో మ‌హేష్ బాబు న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి.సినిమా మొత్తం హాలీవుడ్ రెంజ్‌లో ఉంటుంది.స్క్రీన్ ప్లే బాగుంటుంది.రీవెంజ్ స్టోరిని స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్‌గా తెర‌క్కెకించారు.కాని ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుడిని క‌న్‌ఫ్యూజ‌న్ గురిచేయ‌డంతో ఈ చిత్రం అనుకున్నంత‌ స‌క్సెస్ కాలేదు.కాని ఈ సినిమాకు చాలామంది అభిమాన‌లు ఉండంటం ఇక్క‌డ మ‌రో విశేషం.అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు.ఈ సినిమా త‌రువాత ద‌ర్శ‌కుడు సుకుమార్ స్టార్ స్టేట‌స్ కూడా మారిపోయింది.స‌కుమార్‌కు ఈ సినిమా త‌రువాత పెద్ద హీరోల నుండి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి.ఈ సినిమా త‌రువాతే ఎన్టీఆర్ కూడా నాన్న‌కు ప్రేమ‌తో సినిమా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -