Monday, April 29, 2024
- Advertisement -

బెంగళూరు బౌలింగ్‌ను ఊచకోత కోసిన సునీల్ న‌రైన్‌

- Advertisement -

ఐపీఎల్‌-11లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ శుభారంభం చేసింది. కొత్త కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలో ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది.

విధ్వంసక ఓపెనర్‌గా రూపాంతరం చెందిన వెస్టిండీస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా తలో చేయి వేయడంతో 177 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా సులువుగానే ఛేదించింది

సునీల్ నరైన్.. ఇప్పటి వరకు మిస్టరీ స్పిన్నర్‌. కానీ.. ఇకపై అతడ్ని విధ్వంసక హిట్టర్ అని కూడా పిలవాలేమో..? ఐపీఎల్‌లో గత ఏడాది వరకూ బంతితో మాత్రమే రాణించిన.. ఈ వెస్టిండీస్ స్పిన్నర్ ఇప్పుడు బ్యాట్‌తో‌ టాప్ హిట్టర్లని మించిన ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సునీల్ నరైన్ (50: 19 బంతుల్లో 4×4, 5×6) మెరుపు అర్ధశతకం బాదేశాడు. అతని దూకుడుకి బెంగళూరు అగ్రశ్రేణి బౌలర్లు సైతం.. భారీగా పరుగులు సమర్పించుకోగా.. 177 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 18.5 ఓవర్లలోనే ఛేదించేయగలిగింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గత ఏడాది సీజన్ మధ్యలో రెగ్యులర్ ఓపెనర్ క్రిస్‌ లిన్ గాయపడటంతో ప్రయోగాత్మకంగా సునీల్ నరైన్‌ని ఓపెనర్‌గా పంపింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నరైన్.. తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టేశాడు. అలా ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్‌గా ఫిక్సయిన నరైన్ జోరు.. ఆ ఏడాది టోర్నీ ముగిసే వరకూ కొనసాగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -