Friday, April 26, 2024
- Advertisement -

శ్రీరెడ్డికి షాక్‌: సినీ ప‌రిశ్ర‌మ నుంచి బ‌హిష్క‌రించిన ‘మా’

- Advertisement -

ఫిలిం చాంబర్‌పై ఆరోపణలు చేస్తూ చాంబ‌ర్ ఎదుట సినీ న‌టి శ్రీరెడ్డి శ‌నివారం (ఏప్రిల్ 7) అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసి హ‌ల్‌చ‌ల్ సృష్టించింది. వెంట‌నే త‌న‌కు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) స‌భ్య‌త్వం త‌న‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. ఈ ఘ‌ట‌న‌పై సినీ ప‌రిశ్ర‌మ ఉలిక్కిప‌డింది. ఏం చర్యలు తీసుకోవాలో అని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) కార్య‌వ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మ‌య్యింది.

అయితే స‌మావేశంలో శ్రీరెడ్డికి షాకిచ్చేలా ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. ఫిలిం ఛాంబర్‌ దగ్గర అసభ్యంగా ప్రవర్తించిన శ్రీరెడ్డికి ‘మా’ సభ్యత్వం ఇవ్వవ‌ద్ద‌ని నిర్ణయించింది. శ్రీరెడ్డి వివాదంపై ఆదివారం (ఏప్రిల్-8) అత్యవసరంగా సమావేశమైన మా అసోషియేషన్ సభ్యులు సభ్యత్వ నమోదుపై ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీరెడ్డికి ‘మా’లో సభ్యత్వానికి దరఖాస్తు ఇచ్చామని అయితే ఆమె పూర్తి వివరాలు ఇవ్వకపోగా.. క‌నీసం చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వ‌కుండా ఉచితంగా సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేసిందని అసోషియేషన్ ఆరోపించింది. ఫిలిం ఛాంబర్‌లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మా అధ్యక్షుడు శివాజీరాజా.

ఆమె ఆ విధంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో అసోషియేషన్‌లోని 900 మంది సభ్యులు శ్రీరెడ్డితో నటించకూడదని ‘మా’ తీర్మానించినట్లు ప్ర‌క‌టించారు. ఇతర నటీనటులెవరైనా శ్రీరెడ్డిలా ప్రవర్తిస్తే సినీ ప‌రిశ్ర‌మ నుంచి బహిష్కరిస్తామని మా అసోషియేషన్ హెచ్చరించింది. వివాదం చేస్తే కార్డ్ వస్తుందని భావించడం తప్పు అని పేర్కొన్నారు. మా అసోషియేషన్‌కు తెలంగాణ ఫిలిం చాంబర్ కూడా మద్ధతు తెలిపింది.

స‌మావేశంలో ‘మా’ ప్రధాన కార్యదర్శి నరేశ్‌, ఉపాధ్యక్షులు బెనర్జీ, శ్రీకాంత్‌, సహాయ కార్యదర్శులు హేమ, ఏడిద శ్రీరామ్‌, ఉపాధ్యక్షుడు వేణుమాధవ్‌తో పాటు సురేశ్‌కొండేటి, నాగినీడు, ఉత్తేజ్‌, గౌతంరాజు, సి.వెంకటగోవిందరావు, జయలక్ష్మి, ప్రతాని రామకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -