యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా కోసం ఏ హీరో ఇవ్వాని సమయంను ప్రభాస్ బాహుబలి కోసం ఇచ్చాడు. దాదాపు నాలుగేళ్లు టైంను ఇచాడు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు భాగాలుగా ఉన్న ఒక సినిమా కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? అన్న సందేహానికి నిలువెత్తు సమాధానం ప్రభాస్. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే్.. దర్శకుడి మీద ఎంతో నమ్మకం ఉండాలి.
అయితే ప్రభాస్ కు రాజమౌళి మీద ఎంతో అభిమానం ఉంటుంది అనుకుంటారు. అయితే ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అభిమానం వేరు.. సినిమా చేయటం వేరన్న విషయాన్ని స్పష్టంగా చెప్పి అందరి దృష్టిని ఆకర్శించాడు ప్రభాస్. బాహుబలి 2 రిలీజ్ అవుతున్న సమయంలో.. ప్రచారం చేస్తున్నప్పుడు.. సినిమాకు సంబంధించి ఒకరినొకరు పొగిడేసుకోవటం మామూలే. ఇందుకు భిన్నంగా.. వ్యవహరించాడు ప్రభాస్.
ఆదివారం చెన్నైలో జరిగిన బాహుబలి 2 ఆడియో వేడకలో భాగంగా.. మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరన్న ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చారు ప్రభాస్. తన ఆల్ టైమ్ ఫేవరేట్ దర్శకుడు మణిరత్నం అని.. చిన్నప్పటి నుంచి ఆయన్ను అభిమానిస్తానని చెప్పారు ప్రభాస్. తెలుగులో అయితే బాపు అని చెప్పిన ఆయన.. ఇప్పుడైతే రాజమౌళి అని చెప్పటం గమనార్హం. అయితే ఫేవరెట్ డైరెక్టర్ పేరు ఒక్కటే చెప్పాలని చెబితే మాత్రం.. మణిరత్నం పేరునే చెబుతానని.. ఆ విషయం రాజమౌళికి కూడా తెలుసని చెప్పటం విశేషం. ఏది ఏమైనా.. మనసులో ఉన్న మాటను ఇలా బయటకు చెప్పిన డార్లింగ్ ను అందరు అభినందిస్తున్నారు.
Related
