పవన్ కళ్యాణ్ ఓసారి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన విషయం తెలుసా..? చదువుకునే డేస్ లో నిజంగానే చనిపోవాలని ప్రయత్నించాడట పవన్. అయితే అన్నయ్య చిరంజీవి వదినలు ఆపి హితబోధ చేయడంతో అక్కడి నుంచి మనసు దృఢ పరుచుకున్నాడట. ఇటివలే ఓ మ్యాగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయాలను చెప్పాడు. విద్యార్థి దశలో ఏమి సాధించడం లేదనే ఫీలింగ్ తో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించానని పవన్ కల్యాణ్ తెలిపారు.
చిన్నతనంలో సరిగా అబ్బలేదని.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యేవాడినని.. అందుకే సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించనని.. ఇంటర్ పరీక్షలు టైంలో కాపీ కొట్టే చాన్స్ ఉన్న ఆ పని చేయలేదని చెప్పాడు. వచ్చింది రాసి బయటకు వచ్చేసనని.. కాకపోతే ఫెయిల్ అయ్యానని.. మరోసారి ప్రయత్నించినా పాస్ కాలేకపోయానని చెప్పాడు. దాంతో మానసికంగా బాధపడ్డాను.. యుక్త వయస్సులో నా తోటివారందరూ చదువులోను – క్రీడల్లోనూ రాణిస్తుంటే చూసి బాధగా ఉండేది. పేపర్లో చూస్తే సచిన్ టెండూల్కర్ – విశ్వనాథ్ లాంటి చిన్నవయస్సులోనే అద్భుతమైన ప్రతిభను చూపిస్తున్నారనే వార్తలు కనపడేవి. నాకే ఎందుకలా అవుతున్నది. నేను ఏమి సాధించలేక పోతున్నాను అనే నిస్పృహ వెంటాడేది.
దాంతో మానసికంగా కుంగిపోయాను అని పవన్ కల్యాణ్ తన భావాలను పంచుకొన్నారు. ఒత్తిడితో ఆత్మహత్యకు ప్రయత్నించా’’ అని చెప్పారు. పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించిన.. ఇంట్లో వాళ్లు చూసి కాపాడారట. అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ మానసిక స్థైర్యాన్ని నింపారని పవన్ చెప్పాడు. ‘‘‘డిగ్రీలు చదివితేనే చదువు కాదు. నువ్వు చదివినా చదవకపోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు నీకేం కావాలో నిర్ణయించుకో’ అని సలహా ఇచ్చారని పవన్ కల్యాణ్ తెలిపాడు. జానీ మూవీ తర్వాత సినిమాలు మానేద్దామనుకున్నాను. కాని ఆ తర్వాత 22 సినిమాలు చేశాను అని పవన్ కల్యాణ్ చెప్పారు. అదండీ పవన్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ స్టోరీలు.
{youtube}sRJ2gH_WwUE{/youtube}
Related
