వారియర్. హాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్టయిన చిత్రం. వచ్చి నాలుగేళ్లయింది. ఇపుడు అదే సినిమాను మన బిటౌన్ బాబులు హిందీలో రీమేక్ చేసి బ్రదర్స్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
దానికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియదుగాని అపుడే తెలుగులో రీమేక్ చేయడానికి మాత్రం టాప్ హీరోలను వెతుక్కునే పనిలో పడిపోయారు.బిటౌన్లో అక్షయ్ కుమార్, సిద్దార్ధ్ మల్హోత్రాలతో తయారైన ఈ చిత్రం తెలుగులో రామ్ చరణ్ తో పాటు మరో హీరోతో రూపొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బిటౌన్ బ్రదర్స్ ను ప్రొడ్యూస్ చేసిన వారు ఈ సినిమాను తెలుగులో రామ్ చరణ్ తో నిర్మించే ఆలోచనలో ఉన్నారు. అయితే చెర్రీతో చేసే ఆ బ్రదర్ ఎవరనేదే ఇంకా తేలకుండా ఉంది. పరిశీలనలో ఉన్న ఆ ఇద్దరిలో రానా, ప్రభాస్ లున్నారు. ఆల్రెడీ వీరిద్దరు అన్నదమ్ములుగా బాహుబలిలో చేసేశారు. సో వీరిద్దరిలో ఒకరు చెర్రీకి బద్రర్ గా చేయెచ్చు. సో ఆ బద్రర్ ఎవరు..?
ఇండస్ట్రీ వర్గాలు చెప్పడం ప్రకారం చూస్తే… చెర్రీకి బ్రదర్ పాత్రను పోషించే ఛాన్స్ లు రానాకే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ వీరిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో సైన్ చేయడానికి, కలిసి చేయడానికి ఎలాంటి ఇగోలను చూపించకపోవచ్చు. దీనితో పాటు రానాకు అంతగా లేని హీరోయిజం కూడా చెర్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కలిసొచ్చే అంశం.
అదే ప్రభాస్ తో చేస్తే… లేని పోని ఇగోలు భయటపడి సినిమాకు కష్టాలు మొదలవ్వొచ్చు. ఎందుకంటే ఇద్దరూ హీరోయిజంలో పీక్ స్టేజ్స్ లో ఉన్నవారే. సో ఒకరి పాత్రకు న్యాయం జరిగితే మరొకరిపాత్రకు జస్టిఫికేషన్ జరగకపోవచ్చు. కాబట్టి…చెర్రీ కూడా ప్రభాస్ ను ప్రక్కన పెట్టి రానా వైపు మొగ్గు చూపుతున్నాడట. అది కూడా ఎందుకంటే ఇప్పటి వరకూ రానాకు హీరోయిజం పరంగా ఇంకా ఎలాంటి ర్యాంక్ కన్ఫామ్ కాలేదు. కోలీవుడ్లో సూర్య,కార్తిలు చేస్తోన్న ఇదే సినిమా తెలుగులో రానా, చెర్రీలకు ఆల్మోస్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది.