Friday, March 29, 2024
- Advertisement -

దీపిక చేతిలో సినిమాల్లేవ్!

- Advertisement -

స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ బాలీవుడ్‌లో టాప్ రేసులో దూసుకుపోతుంది దీపికా పదుకునే. అగ్ర హీరో సినిమాలలో హీరోయిన్ అంటే ముందుగా దీపికానే సంప్రదిస్తుంటారు.‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌కు పరిచయమై, స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈమె నటించే సినిమాల్లో హీరోల కన్నా ఈమెకే ఎక్కువ పారితోషకం లభిస్తోంది.దీపిక గురించి ఇప్పుడు మరో విశేషం ఏమిటంటే, ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ‘పద్మావత్’ సినిమా త‌రువాత మ‌రో సినిమాకు సైన్ చేయ‌లేదు ఈ భామ‌.ఓ స్టార్ హీరోయిన్ ఇలా సినిమాలు లేకుండా ఖాళీగా ఎందుకు ఉంద‌ని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే దీనికి కార‌ణం ఆమె పెళ్లి అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.రన్ వీర్ సింగ్‌తో గ‌త కొంత కాలంగా ప్రేమలో ఉన్న దీపికా,పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తుంది.పెళ్లికి సంబంధించి షాపింగ్ కూడా పూర్తి చేసింద‌ని స‌మాచారం.వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపార‌ని తెలుస్తుంది.పెళ్లి ఇండియాలోనా, విదేశాల‌లోనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.అందుకే దీపికా సినిమాలు చేయ‌కుండా ఖాళీగా ఉంద‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు.మ‌రి పెళ్లి త‌రువాత దీపికా సినిమాలు చేస్తుందో లేదో తెలియాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -