Saturday, May 18, 2024
- Advertisement -

‘చెంపదెబ్బల’ స్పెషలిస్టుల మధ్య గొడవకు కారణం ఏంటంటే? యంగ్ ఎన్టీఆర్‌తోనే సమస్యనా?

- Advertisement -

షూటింగ్ లొకేషన్‌లో ఆర్టిస్టులకు చెంపదెబ్బలు తినిపించడం తేజకు అలవాటు. బాలయ్యకు లొకేషన్‌తో పెద్ద సంబంధం లేదు. ఆయన చేతికి దురద పుట్టాలి……. అందుబాటులో చెంప ఉండాలి అంతే. అలాంటి ఇద్దరు చెంపదెబ్బల స్పెషలిస్టులు కలిసి వర్క్ చేయడం సాధ్యమా అన్న అనుమానాలు ముందు నుంచే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య-తేజలు మాత్రం నమ్మకంగా సినిమా మొదలెట్టారు. అయితే సినిమా డైరెక్షన్ విషయంలో తేజకంటే బాలయ్యనే ఎక్కువ ఇన్వోల్వ్ అవ్వడంతో తేజ ఇప్పటికే చాలా సార్లు సీరియస్ అయ్యాడు. అయితే బాలయ్య మాత్రం తేజకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు అని తెలుస్తోంది.

అసలు ఈ ఇద్దరి మధ్య గొడవకు ప్రధాన కారణం మాత్రం ఎన్టీఆర్‌నే అని తెలుస్తోంది. యంగ్ ఎన్టీఆర్‌గా బాలయ్య అస్సలు బాగోలేడని టెస్ట్ షూట్ నాడే తేజ స్పష్టంగా చెప్పేశాడు. ఆ పాత్రలో యంగ్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని బాలయ్య మొహం మీదే చెప్పేశాడు తేజ. అలాగే నందమూరి వంశస్థులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నారా చంద్రబాబు, లోకేష్‌ల ప్రాపకం కోసం …వాళ్ళను మెప్పించడమే ధ్యేయంగా ఎన్టీఆర్‌తో లేని శతృత్వాన్ని నడిపిస్తున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ చేసిన తప్పు ఏమీ లేదు. ఎన్టీఆర్‌తో బాలయ్యకు వ్యక్తిగతంగా వివాదాలు కూడా ఏమీ లేవు. అయితే ఎన్టీఆర్‌ని ఎంకరేజ్ చేయడం మాత్రం నారావారికి ఇష్టం లేదు. బాద్షా సినిమా టైంలో ఎన్టీఆర్‌ని తొక్కేయాలని చూశారన్నది కూడా కంటికి కనిపించిన నిజం. అందుకే ఎన్టీఆర్ పేరెత్తగానే బాలయ్యకు చిర్రెత్తుకొచ్చిందట. దాంతో పాటు డైరెక్టర్ రాఘవేంద్రరావు ప్రతి విషయంలోనూ ఇన్వోల్వ్ అవుతూ ఉండడం…..డైరెక్షన్ సూపర్విజన్ చేస్తూ ఉండడం కూడా తేజకు కోపం తెప్పించింది. ఈ రెండు విషయాలతో ఇరిటేట్ అయిన తేజ…..మామూలుగానే కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తేజ బాలయ్యతోనే గొడవపడ్డాడని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా వివాదం తారాస్థాయికి వెళ్ళిందట. తేజపైన బాలయ్య చెయ్యి చేసుకున్నాడని కూడా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అందుకే తేజ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాడని………అది కూడా బాలయ్యకు కూడా చెప్పకుండా డైరెక్ట్‌గా మీడియాకే చెప్పేశాడని తెలుస్తోంది. వెన్నుపోటు ఎపిసోడ్‌లో చంద్రబాబుకు సపోర్ట్ చేసి కన్నతండ్రికి తీవ్ర ద్రోహం చేసిన బాలయ్య……ఇప్పుడు ఆ ఎన్టీఆర్‌కి గుర్తుగా ఉండిపోవాల్సిన సినిమా విషయంలో కూడా అన్యాయం చేస్తున్నాడని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. యంగ్ ఎన్టీఆర్‌గా జూనియర్ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుందని……..ఎన్టీఆర్, బాలయ్యలు కలిసి నటిస్తే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందని ….ఈ విషయంలో బాలయ్యనే స్వర్గీయ ఎన్టీఆర్ కోసం అయినా పట్టువిడుపుల ధోరణి అవలంభించాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. సీతయ్య సినిమాలో ఎవ్వడి మాటా వినడు టైప్ వ్యక్తిత్వం ఉన్న బాలయ్య ఎన్టీఆర్ అభిమానుల ఆవేదనను తన చెవికి ఎక్కించుకుంటాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -