Saturday, April 27, 2024
- Advertisement -

పవన్‌కి సూపర్ షాక్ ఇస్తూ రెస్పాండ్ అయిన పూనం కౌర్…. అనుమానాలు పెంచేలా మాటలు

- Advertisement -

పవన్ కళ్యాణ్-పూనం కౌర్ వ్యవహారం సూపర్ టర్న్ తీసుకుంది. మహేష్ కత్తి చేసిన ఆరోపణలు, చూపించిన సాక్ష్యాలు అన్నీ కూడా పవన్ ఫ్యాన్స్‌ని కూడా షాక్‌కి గురిచేశాయి. అయితే పవన్ అలాంటి వ్యవహారాలు తలపెట్టి ఉండడు అన్న నమ్మకంతో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు పూనం కౌర్ స్పందన పవన్‌ని మరికాస్త ఇరికించేసింది. ఆ తర్వాత పరిణామాలు కూడా సందేహాలన్నింటినీ పటాపంచలు చేసేలానే ఉన్నాయి.

ఒకటైతే నిజం. పూనం కౌర్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించమని చెప్పి చంద్రబాబుకు సిఫార్స్ చేశాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నుంచి నేను ఏమీ ఆశించడం లేదని పవన్ చాలా సార్లు చెప్పాడు కానీ ఇప్పటికి మాత్రం తెరవెనుక వ్యవహారం ఒకటి బయటపడింది. ఈ విషయాన్ని బయటపెట్టిన మహేష్ కత్తిని ఫ్యాట్సో అంటూ బూతు పదాలు వాడేసి కత్తి కాస్తా ఇంకాస్త పదునెక్కేలా చేసింది పూనం కౌర్. పూనం కౌర్-పవన్‌ల సంబంధాన్ని, తిరుమల టెంపుల్‌లో ఒకే గోత్ర నామంతో చేసిన పూజలను, త్రివిక్రమ్ సమక్షంలో పవన్-పూనంలు చేసిన క్షుద్రపూజల వ్యవహారాలను, పవన్ హ్యాండ్ ఇవ్వడంతో పూనం కౌర్ ఆత్మహత్యా ప్రయత్నం చేయడం, ఆ తర్వాత మళ్ళీ పవనే హాస్పిటల్ బిల్లులు అన్నీ పే చేసి ఆ తర్వాత మళ్ళీ సెటిల్‌మెంట్‌కి రావడం…….మహేష్ కత్తి చెప్పిన ఒక్కొక్క విషయం కూడా చాలా మందిని షాక్‌కి గురిచేసింది. ముందుగా బుకాయించిన జనసేన జనాలు……అవి క్షుద్ర పూజలు కాదు అని మాత్రం టివి డిబేట్స్‌లో చెప్పగలిగారు.

ఆ విషయం పక్కనపెడితే తాజాగా పూనం కౌర్ ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో స్పందించింది. మహేష్ కత్తి చెప్పిన విషయాలను తాను ఖండించకుండా…….పవనే ఈ విషయంపై స్పందించాలని కోరింది. ‘పవన్ కళ్యాణ్‌గారు ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మీరే నన్ను బయటపడేయండి…..మీరు స్పందించండి’ అని పూనం కౌర్ సోషల్ మీడియాలో మెస్సేజెస్ చేసింది. పూనం కౌర్ స్టేట్‌మెంట్ పవన్ ఫ్యాన్స్‌ని కూడా షాక్‌కి గురి చేసింది. అంతకుమించిన షాక్ ఏంటంటే……..ఆ తర్వాత కాసేపటికే తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ మెస్సేజ్‌ని డిలీట్ చేసింది పూనం కౌర్.

పూనం కౌర్ వ్యవహారం పుణ్యమాని ఇప్పుడు పవన్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. సందేహంగా ఆలోచిస్తున్నవాళ్ళు కూడా ఒక అభిప్రాయానికి రావాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ముందు ముందు ఈ వ్యవహారాలు ఇంకా ఎలా టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -