Friday, April 19, 2024
- Advertisement -

గన్‌మేన్ హోదా కోసం ఎమ్మెల్యే అయిన కోటాకి రోజా, జగన్‌ల గురించి మాట్లాడే అర్హత ఉందా?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉంటూ రాజకీయాలు వెలగబెట్టిన నటులు, సాంకేతిక నిపుణులంత స్వార్థపరులు ఇంకెవరూ ఉండరేమో. అందరూ కూడా వెండితెర ఇమేజ్‌ని క్యాష్ చేసుకుంటూ ఓట్లు దండుకుని పదవులు అనుభవించినవాళ్ళే. పదవిలో ఉన్నన్నాళ్ళూ ప్రజలకు చేసింది ఏమీ ఉండదు. అందుకే ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతారు. ఇక ఆ తర్వాత రాజకీయాలకు మేం సూట్ కాం అంటూ రాజకీయాలు కుళ్ళిపోయాయి అంటూ కొన్ని పడక్కుర్చీ కబుర్లు చెప్పి సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ ఉండిపోతారు. ఒక్క ఎన్టీఆర్‌ని మినహాయిస్తే అందరిదీ ఇదే చరిత్ర. ఈ దరిద్రపు చరిత్రలో కోటా శ్రీనివాసరావుది కూడా ఒక పేజీ ఉంది. బాబు మోహన్‌కి ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు ఆయన గన్‌మేన్లతో షూటింగ్‌కి వస్తే……..ఆ హోదా చూసి ఇన్‌స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చానని ఆ మధ్య ఒక ఎల్లోమీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో కోటా చెప్పాడు. బిజెపిలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా టిడిపికి బాకా ఊదుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆ పార్టీ పెద్దలతో పనులు చేయించుకుంటూ ఉన్న నటుడు కోటా శ్రీనివాసరావు. కేవలం నటన వరకూ తీసుకుంటే……. కోటా అద్భుతమైన నటుడని చెప్పొచ్చు. కానీ కేవలం తన పదవీ స్వార్థం కోసం ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పదవి అనుభవించి…….. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి పదవి పోగానే పూర్తిగా ప్రజల గురించి పట్టించుకోని కోటా శ్రీనివాసరావు కూడా రోజా, జగన్‌ల గురించి మాట్లాడడం మాత్రం కచ్చితంగా ఆక్షేపణీయం.

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఏ ఒక్కరైనా రోజా స్థాయిలో ప్రజల మధ్య ఎప్పుడైనా ఉన్నారా? వైఎస్ రాజశేఖరరెడ్డి, చిరంజీవి, చంద్రబాబునాయుడు, కెసీఆర్, పవన్ కళ్యాణ్……..ఇలా తనకంటే ఎంతో శక్తివంతులైన నాయకులందరితోనూ ధైర్యంగా పోరాడిన చరిత్ర రోజాకి కాకుండా ఇంకెవరికైనా ఉందా? పవన్ కళ్యాణ్, చిరంజీవితో సహా అందరూ కూడా అందరితో బాగుంటూ వ్యక్తిగతంగా బాగుపడుతూ, వస్తే పదవిని కూడా అనుభవిద్దామన్న బాపతు నాయకులేగా?

ఇక మూడున్నరేళ్ళ పాలనను చంద్రబాబును ఓడించాలన్న నిర్ణయానికి కానీ, విమర్శించడం కానీ చేయకూడదని ఒక అమూల్యమైన మాట చెప్పాడు కోట. ఆయన మాటల్లోనే మూడున్నరేళ్ళలో బాబు చేసింది ఏమీ లేదన్న అర్థం ధ్వనిస్తోంది. అలాగే చంద్రబాబు పాలన ఎన్నేళ్ళు చూశాక ఆయనను విమర్శంచాలో కూడా కోటా చెప్పి ఉంటే బాగుండేది. కనీసం బాబు పాలన ఇంకో పదేళ్ళు, ఆ తర్వాత లోకేష్ పాలన మరో పదో, ఇరవై ఏళ్ళో చూశాక ప్రజలు ఒక నిర్ణయానికి రావొచ్చా? అలాగే పవన్ కళ్యాణ్, బాలయ్యలలాంటి వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంటుంది కానీ జగన్‌కి మాత్రం ఉండదా? అవునులే ……పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ ప్రజల మధ్యనే ఉంటున్న జగన్‌కి పదవి అర్హత ఎందుకుంటుంది? కోటా శ్రీనివాసరావులా, పవన్‌లాగా, బాలయ్యలాగా అద్దాల మేడల్లో, ఫాం హౌస్‌లలో జీవితాలను ఎంజాయ్ చేస్తూ చుట్టపు చూపుగా….విహార యాత్రకు వచ్చినట్టుగా ప్రజల మధ్యకు వచ్చే వాళ్ళకు మాత్రం పదవిని చేపట్టడానికి అన్ని అర్హతలూ ఉంటాయి. ముదిమి వయసు వచ్చాక కూడా సొంత ప్రయోజనాలే చూసుకుంటే ఎలా కోటాగారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -