ఏప్రిల్ 14న రజనీకాంత్ సినిమా విడుదల
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలు ఎప్పుడూ అనుకున్న సమయానికి విడుదల కావు. ఆ సినిమాపై అంచనా పెట్టుకున్న ప్రేక్షకులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న ‘2.ఓ’, ‘కాలా’ సినిమాలు విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. మొదటి 2.ఓ అని తర్వాత కాలా అని ఎలా వెనక్కి ముందుకు ఈ రెండు సినిమాలు తాత్సారం చేస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల విడుదలపై ఓ క్లారిటీ వచ్చిసినట్టే. మొదటగా ‘కాలా’ సినిమానే ప్రేక్షకులు, అభిమానుల ముందుకు రాబోతోందని సమాచారం.
ప్రస్తుతం రాజకీయ ప్రవేశం చేసిన రజనీకాంత్ నటిస్తున్న ఈ రెండు సినిమాల తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. దీంతో రజనీ ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రంజిత్ దర్శకత్వంలో ‘కాలా’ సినిమా ముంబాయి నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీ అల్లుడు, నటుడు ధనుశ్ తన వండర్‌బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా పూర్తికావడంతో విడుదలకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.ఓ’ సినిమా ఈ సంవత్సరం చివరన విడుదల చేసే అవకాశం ఉంది.