Saturday, May 18, 2024
- Advertisement -

మహేశ్ సినిమాను సల్మాన్ ఇంకోసారి రీమేక్ చేస్తాడా?!

- Advertisement -

ఇప్పటికే మహేశ్ బాబు సినిమాను ఒకదాన్ని రీమేక్ చేశాడు బాలీవుడ్ హీరో సల్మాన్. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘పోకిరి’ హిందీ వెర్షన్ లో సల్లూ హీరోగా నటించాడు.

అక్కడ కూడా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ విధంగా చూసుకొంటే సల్లూకూ మహేశ్ సెంటిమెంట్ పాజిటివ్ సైనే. ఇంతే కాదు.. ఇంకా అనేక తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి విజయాలు సొంతం చేసుకొన్నాడు సల్లూ.

కిక్ , రెడీ, స్టాలిన్ వంటి తెలుగు సినిమాలను ఈ మధ్య కాలంలోనే సల్మాన్ హిందీలో  రూపొందించాడు. అవన్నీ కూడా భారీ స్థాయి కలెక్షన్లను సాధించాయి. మరి ఇప్పుడు సల్లూ ‘శ్రీమంతుడు’పై కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. కాన్సెప్ట్ పరంగా ప్రశంసలు అందుకొంది ఈ సినిమా. సందేశాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి సల్మాన్ కు ఇది బాగా సెట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాను సల్లూ ఇప్పటికే చూసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు ఇది నచ్చేసిందని కూడా సమాచారం. మరి మహేశ్ సినిమా హిందీలో రీమేక్ అవుతుందేమో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -