Sunday, April 28, 2024
- Advertisement -

వాహ్ తాజ్ అంటున్న అక్షయ్.. ఫోటో వైరల్!

- Advertisement -

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా తాజ్ మహల్ ముందు తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఆనంద్ ఎల్​.రాయ్​ దర్శకత్వంలో అక్షయ్​ కుమార్​, సారా అలీఖాన్​, ధనుష్​ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అత్రాంగిరే’. ఈ సినిమా షూటింగ్​ ప్రస్తుతం ఆగ్రాలో తాజ్​ మహల్​ వద్ద జరుగుతోంది.

విభిన్న ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ‘అత్రాంగిరే’లో సారా అలీ ఖాన్ బిహారి అమ్మాయి పాత్రలో కనువిందు చేయనుంది. షూటింగ్​లోని ​ ఓ సరదా వీడియోను అక్షయ్​ తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశాడు.

ఇక తాజ్​ మహల్​ ముందు షాజహాన్​ వేషధారణలో గిరిగరా తిరుగుతూ కనిపించాడు అక్షయ్​. జాతీయ అవార్డు గ్రహీత హిమాన్షు శర్మ కథ అందిస్తుండగా, ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తు న్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2021 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన 2.0 లో అక్షయ్ విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -