Wednesday, May 8, 2024
- Advertisement -

ఒరిజినల్ సూపర్ హీరో కథతో.. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ‘హనుమాన్’!

- Advertisement -

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. వెరైటీ కథనాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో సఫలం అవుతున్నారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన కల్కీ, నాని నిర్మాతగా వ్యవహరించిన ‘అ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. కాస్త గ్యాప్ తీసుకొని ఇటీవల జాంబీ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు తెరపై ఇంతవరకు ఎవ్వరూ ప్రయత్నించని జోనర్ లో సినిమా తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నాడు.

తాజాగా ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఖరారైంది. ‘హనుమాన్’ పేరుతో ఆయన తన కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ప్రశాంత్ వర్మ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్మాతలు శనివారం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. ’హనుమాన్‘ సినిమా టాలీవుడ్ లో వస్తున్న మొట్టమొదటి సూపర్ హీరో సినిమా అని నిర్మాతలు తెలిపారు.

తెలుగులో ఇదే మొట్టమొదటి ఒరిజినల్ సూపర్ హీరో తెలుగు ఫిలిం అని ప్రశాంత్ వర్మ టీమ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తుంటే హనుమంతుడి అంశతో జన్మించినవారో .. అనుగ్రహం పొందినవారో చేసే విన్యాసాలకు సంబంధించినదిగా అనిపిస్తోంది. కాకపోతే కథ .. కాన్సెప్ట్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు.

Watch: ‘వైయస్‌ జగన్‌ అనే నేను..’ సంక్షేమ సంతకానికి రెండేళ్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -