Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబలి 2 లో ఎన్టీఆర్!

- Advertisement -

తెలుగు, తమిళ బాషలతో పాటు హిందీ భాషలో విడుదలై ఇండియన్ సినిమా చరిత్రలో ఓ కొత్త పేజిని లిఖించుకున్న బాహుబలి గురించి తెలియని వారు లేరు. బాహుబలి సినిమాని రెండు పార్టులుగా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రెండో పార్ట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. అయితే అవి గాలి వార్తలని చాలామంది కొట్టిపారేశారు.

కానీ రాజమౌళి మాత్రం అది నిజమే అంటున్నారు. తనకు ఎంతో ఆప్తమిత్రుడు అయిన ఎన్టీఆర్ కు బాహుబలి2 లో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఇస్తున్నట్లుగా తేలిపోయింది. ఇదే క్యారెక్టర్ ని తమిళ్ లో సూర్య చేస్తున్నట్లు తెలుస్తుంది. బాహుబలి పార్ట్ 1 కంటే బాహుబలి పార్ట్ 2 ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో స్వయంగా నటిస్తానని సూర్య గతంలోనే వెల్లడించాడు.

కాగా తాజాగా తెలుగులో ఎన్టీఆర్ చేస్తున్న పాత్ర పేరు కూడా బయటకొచ్చింది. ఎన్టీఆర్ నటిస్తున్న పాత్ర పేరు జయదేవ్ రానా అని తెలుస్తుంది. జక్కన్న, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు అవకాశం లభించిందని అందరికి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ వార్తతో తెగ సంబరపడిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -